OG Release Date: ఓజీ రిలీజ్ డేట్ లాక్.. పవన్ దిగేది ఎప్పుడంటే? పెద్ద ప్లానింగే!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఓజీ ఒకటి. హరిహర వీరమల్లును మించిన క్రేజ్ ఈ సినిమా సొంతం. స్టైలీష్ లుక్‌లో పవన్ కళ్యాణ్ ఫోటోలు అభిమానులను పిచ్చెక్కిస్తూ.. ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఉత్కంఠ రేపుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో బిజీ కావడానికి ముందు ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టించారు. ఆ తర్వాతి నుంచి చిత్రీకరణ నత్తనడకన సాగుతోంది. అయితే సినిమా రిలీజ్ డేట్‌పై రకరకాల గాసిప్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఓజీ బడ్జెట్ ఎంత?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సాహో తెరకెక్కించిన అనంతరం సుజిత్‌కు పవర్‌స్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రంతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇంకా అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

OG release date Pawan Kalyan s movie to hit theatres on this date

ఓజీ షూటింగ్‌కు అడ్డంకులు
ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో నటిస్తున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 2022న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ప్రభాస్‌తో సాహో తీసిన వెంటనే సుజిత్‌కు పవన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరకడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్, ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంది ఈ సినిమా. ఇదే ఊపులో కంటిన్యూ చేసుంటే సినిమా ఖచ్చితంగా పూర్తయ్యేది. అయితే ఈ లోపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఆపై డిప్యూటీ సీఎంగా బాధ్యతలతో ఓజీ షూటింగ్ ముందుకు కదల్లేదు.

సెట్స్‌పై ఉండగానే కళ్లు చెదిరే బిజినెస్
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ వైపు సినిమా షూటింగ్ పూర్తి కాకుండా మరోవైపు ఓజీకి కళ్లు చెదిరే బిజినెస్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నైజాం థియేట్రికల్ రైట్స్‌ ఏకంగా 90 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పరిస్ధితి ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ సమయంలో ఎలా ఉంటుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాగే ఓజీ డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు.

ఓజీ రిలీజ్ డేట్ ఇదే
ప్రస్తుతం హరిహర వీరమల్లును పవన్ కళ్యాణ్ రిలీజ్‌కు సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లూ ఓజీపై పడ్డాయి. ఈ సినిమా షూటింగ్‌ను పవన్ పూర్తి చేసేశారని, రిలీజ్ డేట్ ఇదేనంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలకు చిత్ర యూనిట్ తెరదించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ 25న ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. అయితే సెప్టెంబర్‌ 25 డేట్‌పై మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు కన్నేశారు. చిరంజీవి విశ్వంభర, బాలయ్య - బోయపాటిల అఖండ 2 కూడా ఆ డేట్‌ని లాక్ చేయాలని భావిస్తున్నారు. అయితే అందరికంటే ముందే పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25పై కర్చీఫ్ వేయడంతో చిత్ర పరిశ్రమలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరి కోసం ఎవరు తమ సినిమాను వాయిదా వేసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X