కెనడాలో ఓజీ రిలీజ్‌పై ట్విస్ట్.. డిస్ట్రిబ్యూటర్‌పై లీగల్ యాక్షన్, వివాదం ఏంటంటే?

సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. సెప్టెంబర్ 25న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మేనియా పట్టుకుంది. మన దగ్గరే కాదు ఓవర్సీస్‌లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్‌లో టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. పవన్‌ని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టికెట్స్ ఎంతైనా పెట్టి కొనేందుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌లోని కీలకమైన కెనడాలో ఓజీ రిలీజ్‌కు సంబంధించి వివాదం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఓజీ సినిమా బడ్జెట్ ఎంత?
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్‌హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

OG release trouble in Canada York Cinemas to take legal action against Prathyangira Cinemas

లక్షలు పలుకుతున్న టికెట్ ధర
ఆంధ్రా, తెలంగాణతో పాటు ఓవర్సీస్‌లో ఓజీ కోసం అభిమానులు ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు. నైజాం ఏరియాలో ఓజీ తొలి టికెట్‌ను కొద్దిరోజుల క్రితం వేలం వేయగా ఇద్దరు పవన్ కళ్యాణ్ అభిమానులు దానిని 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ అభిమాని ఓజీ టికెట్‌ను దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ మొత్తాలను జనసేన పార్టీకి విరాళంగా అందించాలని పలురు నిర్ణయించిన సంగతి తెలిసందే.

ఓవర్సీస్‌లో ఓజీ రికార్డులు
పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజం, పాటలు, బీజీఎంలతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఫారిన్‌లోనూ పవన్ ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. దీంతో నార్త్ అమెరికాలో ఓజీ ప్రభంజనం కొనసాగుతుండగా మూవీ 2 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో రూ.16 కోట్ల రూపాయలు) చేరుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ డేట్ నాటికి ఓజీ ఓర్సీస్‌లో ఇంకెన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇలాంటి పరిస్ధితుల్లో కెనడాలో ఓజీ రిలీజ్‌కు సంబంధించి వివాదం చోటు చేసుకుంది.

కెనడాలో ఓజీ రిలీజ్‌పై ట్విస్ట్
ఓజీని ఓవర్సీస్‌లో ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తోంది. అయితే నార్త్ అమెరికాలో ప్రత్యేకించి కెనడాలో భారతీయ మూవీ థియేటర్ చైన్‌గా ఉన్న యార్క్ సినిమాస్‌కి ప్రత్యంగిరా సినిమాస్‌తో వివాదం నెలకొంది. కెనడాలో ఓజీ రిలీజ్‌కి సంబంధించి గతంలో హామీ ఇచ్చిన విధంగా తమతో కలిసి పనిచేస్తారా? లేదా? అనే దానిపై ప్రత్యంగిరా సినిమాస్ స్పష్టత ఇవ్వడం లేదని యార్క్ సినిమాస్ మండిపడింది. దీంతో కెనడాలో ఓజీ రిలీజ్‌పై సందిగ్థత నెలకొంది. ప్రేక్షకుల్లో గందరగోళం నేపథ్యంలో తమ లీగల్ టీమ్ ఇప్పటికే ఈ వివాదంపై పనిచేస్తోందని యార్క్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ప్రత్యంగిరా సినిమాస్ vs యార్క్ సినిమాస్
వివాదం గురించి ఇప్పటికే మేం మీకు తెలియజేశామని.. సమస్యను పరిష్కరించలేకపోతే మీ టికెట్ ధర మొత్తాన్ని రిఫండ్ చేస్తాం. రిలీజ్‌కు మందు ఇలాంటి అంతరాయాలను నివారించడానికి తాము ఇకపై ఈ పంపిణీదారుతో కలిసి పనిచేయమని యార్క్ సినిమాస్ ఆ పోస్ట్‌లో తేల్చిచెప్పింది. ఈ పోస్ట్‌తో యార్క్ సినిమాస్ రెండు విషయాలను కుండబద్ధలు కొట్టినట్లయ్యింది. ప్రత్యంగిరా సినిమాస్‌పై న్యాయపరమైన చర్యలతో పాటు భవిష్యత్తులో ఈ సంస్థతో భాగస్వామ్యాన్ని నిలిపివేయడం. అయితే ప్రత్యంగిరా సినిమాస్‌పై యార్క్‌తో వివాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు.. గతంలో పుష్ప 2 విడుదల సమయంలోనూ ఈ డిస్ట్రిబ్యూటర్‌తో ఆర్ధిక సమస్యలను బయటపెట్టారు. దీంతో ఓజీ చిత్రం కెనడాలో రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

స్పందించిన ప్రత్యంగిరా
ఈ నేపథ్యంలో ప్రత్యంగిరా సినిమాస్ స్పందించింది. కెనడాలో ఓజీ రిలీజ్, ఓజీకి థియేటర్స్ లిస్ట్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది. అలాగే నార్త్ అమెరికాలో ఓజీ మూవీ స్క్రీనింగ్ కోసం కంటెంట్, కేడీఎంలను సమయానికి పొందేలా వర్క్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. దీంతో వివాదం పరిష్కారమైనట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: og pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X