OG మూవీలో షాకింగ్ సీన్‌ను లీక్ చేసిన సుజిత్.. పవన్ కల్యాణ్‌కు ఆ రేంజ్ ఎలివేషనా?
తెలుగు సినిమా దగ్గర క్రేజ్ అనే పదం వస్తే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఆ ప్రస్తావనే ఉండదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. మరి అంతలా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా..
దీనితో ఈ 2024 ఏడాది అంతా మెగా అభిమానులకి ఒక హై ని ఇచ్చిన ఏడాదిగా లైఫ్ లో నిలిచి పోయింది. కాగా ఇప్పుడు ఇదే హోదాలో పవన్ కళ్యాణ్ మరింత బిజీగా మారిపోయారు. కానీ ఈ క్రమంలోనే తను ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. కాగా సమయం చూసుకొని పవన్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల్లో రెండు సినిమాలు మళ్లీ సెట్స్ మీదకి చేరుకున్నాయి.

కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ దర్శకుడు జ్యోతి కృష్ణతో పీరియాడిక్ సినిమా "హరహర వీరమల్లు" ఒకటి దర్శకుడు సుజిత్ తో "ఓజి" అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో "ఉస్తాద్ భగత్ సింగ్" అనే భారీ సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూడింటిలో భారీ హైప్ ఉన్న సినిమా మాత్రం దర్శకుడు సుజిత్ తో చేస్తున్న సెన్సేషనల్ యాక్షన్ డ్రామా ఓజి అనే చెప్పాలి. దీనిపై ఉన్న అంచనాలే వేరు..
కాగా ఈ సినిమాలో మైండ్ బ్లాకింగ్ సీన్స్ ని మేకర్స్ ఆల్రెడీ చేస్తుండగా ఇటీవలే సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ పై క్రేజీ రూమర్స్ వినిపించాయి. కాగా అయితే వీటి తర్వాత ఓజి లో ఒక బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్ తాలూకా సీన్ కోసం చర్చ జరుగుతుంది. కాగా ఈ సినిమా గ్లింప్స్ తోనే సినిమాలో వైలెన్స్ ఊహించని రీతిలో ఉంటుంది అని కూడా చెప్పేసారు.
దీనితో సినిమాలో రక్త పాతానికి చాలా మంది ఏదొకటి చేసి "ఆర్" రేటింగ్ కూడా తీసుకురమ్మని చెప్పారు. అయితే ఓజి లో పవన్ రోల్ అంత భయానకంగా ఉంటుందా అంటే లేటెస్ట్ లీక్ తో అవునని చెప్పక తప్పదు. కాగా ఈ లీక్ లో దర్శకుడు సుజిత్ కి మేకర్స్ బర్త్ డే విషెస్ తెలిపర్మ్ ఇందులో ఒక కనీ కనిపించని షాట్ లో గమనిస్తే ఒక పోలీస్ కుర్చీలో కూర్చుని కనిపిస్తాడు.

కానీ ఆ పోలీస్ కి మొండెం ఉంది కానీ తల లేదు. అంటే ఆ సీన్ లో ఓజి ఆ పోలీస్ తాలూకా తల నరికేసాడు.. దీనితో ఈ షాట్ చూసిన పవన్ ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. అసలు పవన్ సినిమాలో ఇలాంటి విజువల్స్ ఊహించలేదు అని ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. కాగా ఇదే షాట్ కి గతంలో వచ్చిన టీజర్ వీడియోలో చూసినట్టు అయితే పవన్ ఒక షాట్ లో స్టైల్ గా పోలీస్ స్టేషన్ లోనే నడుచుకుంటూ వచ్చినట్టు కనిపిస్తుంది.
తన భుజంపై తుపాకీనో కటానానో ఒకలాంటిది ఉంటుంది. దానికి ఒక బ్యాగ్ కూడా ఉంటుంది. మరి ఆ బ్యాగ్ లోనే పోలీస్ తల ఉంది అంటూ అభిమానులు ఇంట్రెస్టింగ్ థియరీలు కూడా చెప్పేస్తున్నారు. మరి ఏవి నిజం అవుతాయో ఏమో కాని ఇప్పుడు ఓజి మీద అంచనాలు మాత్రం ఉండగా ఉండగా మరింత ఎక్కువయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











