OG Universe: 'ఓజీ 2' పై హైప్ పెంచిన మేకర్స్.. పవన్ కళ్యాణ్‌తో స్పెషల్ వీడియో..

OG 2 Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ మూవీ 'ఓజీ' (OG).ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా మూవీ యూనిట్ మరో బిగ్ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. జీ యూనివర్స్ బిగిన్స్ - ది ఆర్జిన్ ఆఫ్ ఫైర్ (OG Universe Begins - The Origin of Fire) పేరుతో ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో 'ఓజీ' యూనివర్స్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

OG Universe Begins Pawan Kalyan s Special Video Raises Massive Hype for OG 2 Sequel

ఈ వీడియోలో "ప్రతి జ్వాల పుట్టుక వెనుక ఒక కథ ఉంటుంది. కానీ ఈ అగ్ని అన్నింటినీ తలకిందులు చేసింది. ఇదే 'ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్' (Every Fire Has an Origin. This One Changed Everything. The Origin of Fire) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌ను జత చేశారు. దీంతో అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేశారు. ఈ ఒక్క లైన్‌తోనే 'ఓజీ 2' కథ మరింత భారీ స్థాయిలో ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే 'ఓజీ 2' ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది.

కత్తితో పవన్ లుక్.. గంభీర ఎంట్రీకి హింట్
వీడియోలో పవన్ కళ్యాణ్ వెనుక వైపు నుంచి కనిపిస్తూ చేతిలో కత్తి పట్టుకుని నిలబడిన విజువల్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. పూర్తి లుక్ చూపించకపోయినా, ఈ ఒక్క షాట్‌తోనే మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. 'గంభీర' పాత్ర చుట్టూనే 'ఓజీ' యూనివర్స్ మరింత విస్తరించబోతోందనే సంకేతాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

'ఓజీ' మొదటి భాగానికి ఎస్. థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సీక్వెల్‌కు కూడా ఆయనే సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. ఈ వీడియోలో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. 'ఓజీ 2'లో థమన్ మరోసారి తన మ్యూజికల్ మ్యాజిక్ చూపించనున్నారని అభిమానులు భావిస్తున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తొలి భాగంలో చూపించిన గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని సీక్వెల్‌లో మరింత విస్తృతంగా, కొత్త పాత్రలు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాను కేవలం సీక్వెల్‌గా కాకుండా 'OG Universe'గా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, త్వరలోనే 'ఓజీ' కోసం డేట్స్ కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేకర్స్ విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక చిన్న వీడియోతోనే 'ఓజీ 2'పై అంచనాలను మరింత పెంచడంలో మూవీ మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Read more about: pawan kalyan sujeeth og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X