‘ఓ బేబీ’ ట్రైలర్ కేక: మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలంటున్న సమంత!

Recommended Video

Samantha Akkineni's Oh Baby Trailer Looks Promising

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న 'ఓ బేబీ' సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 5న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మరింత స్పీడప్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. 2 నిమిషాల 12 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంలో ప్రేక్షకుల్లో ఒక క్లారిటీ వచ్చేలా చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో డి సురేష్ బాబు, సునీత తాటి, టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి

మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి

ఓ సీన్లో... మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమంత స్పందిస్తూ... ‘చూడటానికి అందంగా ఉండాలి, నేను ఏం కొనుక్కోవాలనుకున్నా వాడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి, మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి' అంటూ సమాధానం ఇస్తుంది. ఈ డైలాగ్ టీజర్ మొత్తానికే హైలెట్ అయింది.

వినోదంతో పాటు మనసుకు హత్తుకునే భావోద్వేగాలు

వినోదంతో పాటు మనసుకు హత్తుకునే భావోద్వేగాలు

సినిమాలో వినోదంతో పాటు మనసుకు హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. సమంత కెరీర్లో ఇది ది బెస్ట్ మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పెర్ఫార్మెన్స్ పరంగా, నటిగా సమంత తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇష్టంగా చేసిన సినిమా

ఇష్టంగా చేసిన సినిమా

సమంత తన కెరీర్లో చాలా ఇష్టంగా చేసిన సినిమాల్లో ‘ఓ బేబీ' మూవీ ఒకటి. ఇటీవల సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... సినిమాల నుంచి వెళ్లి పోయే ముందు ఒక పూర్తి స్థాయి కామెడీ మూవీ చేయాలనుకున్నాను, అది ఈ సినిమాతో సాధ్యమైందని వ్యాఖ్యానించారు.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

‘ఓ బేబీ' చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తోంది. సినిమాపై మంచి హైప్ ఉండటంతో దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. కొరియన్ హిట్ మూవీ ‘మిస్ గ్రానీ' చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.

ముఖ్య పాత్రల్లో...

ఈ చిత్రంలో సమంతతో పాటు లక్ష్మి, రావు రమేష్, నాగ శౌర్య, రాజేంద్రప్రసాద్, ఊర్వశి, ప్రగతి, తేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, డైలాగ్స్: అక్ష్మి భూపాల, ఆర్ట్: విఠల్ కె, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, డిఓపి: రిచర్డ్ ప్రసాద్, నిర్మాతలు: సురేష్ బాబు, సునితా తాటి, టిజి విశ్వప్రసాద్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నందినీ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X