twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్బీ చౌదరీ కుమారుడు హీరోగా ఒకటే లైఫ్.. మే 3న గ్రాండ్ రిలీజ్

    |

    సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌బీ చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా పరిచయం అవుతున్న 'ఒకటే లైఫ్‌' రిలీజ్‌కు సిద్ధమైంది. 'హ్యాండిల్‌ విత్‌ కేర్‌' అన్నది ఉప శీర్షికతో వస్తున్న ఈ చిత్రం మే 3 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. లార్డ్‌ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై నారాయణ రామ్‌ నిర్మిస్తొన్న చిత్రంలో శృతి యుగల్‌ కథానాయిక. ఎం.వెంకట్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ సందర్భంగా..
    దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ.. ''టెక్నాలజీ వెనుక పరుగులు పెడుతున్న నేటి తరం.. హ్యూమన్‌ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. అమ్రీష్‌ చక్కని బాణీలు అందించారు. నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్‌ బోర్డ్‌ చాలా మంచి సినిమా తీశారని ప్రశంసించారు. అని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

     Okate Life is releasing on May 3rd

    నిర్మాత నారాయణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ''సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. టీఆర్ఎస్ నేత హరీష్‌ రావు విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మే నెల 3న సినిమా సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

    English summary
    Super Good film boss, Producer RB Chowdary introducing his son Jitan Ramesh to tollywood. Jitan is testing his fate with Okate Life movie. This movie is releasing on May 3rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X