Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆర్బీ చౌదరీ కుమారుడు హీరోగా ఒకటే లైఫ్.. మే 3న గ్రాండ్ రిలీజ్
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా పరిచయం అవుతున్న 'ఒకటే లైఫ్' రిలీజ్‌కు సిద్ధమైంది. 'హ్యాండిల్ విత్ కేర్' అన్నది ఉప శీర్షికతో వస్తున్న ఈ చిత్రం మే 3 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ రామ్ నిర్మిస్తొన్న చిత్రంలో శృతి యుగల్ కథానాయిక. ఎం.వెంకట్ దర్శకత్వం వహించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ
సందర్భంగా..
దర్శకుడు
వెంకట్
మాట్లాడుతూ..
''టెక్నాలజీ
వెనుక
పరుగులు
పెడుతున్న
నేటి
తరం..
హ్యూమన్
రిలేషన్స్‌కు,
ఎమోషన్స్‌కు
ప్రాధాన్యత
ఇవ్వాలన్న
కథాంశంతో
యూత్
ఫుల్
ఎంటర్టైనర్గా
ఈ
సినిమాను
తెరకెక్కించాం.
అమ్రీష్
చక్కని
బాణీలు
అందించారు.
నేపథ్య
సంగీతం
సినిమాకు
ప్రత్యేక
ఆకర్షణగా
నిలుస్తుంది.
సెన్సార్
బోర్డ్
చాలా
మంచి
సినిమా
తీశారని
ప్రశంసించారు.
అని
వర్గాల
ప్రేక్షకులు
మెచ్చుకునేలా
ఈ
సినిమా
ఉంటుంది
అన్నారు.
నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. ''సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. టీఆర్ఎస్ నేత హరీష్ రావు విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మే నెల 3న సినిమా సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.