పుష్పగాడి మేనియా ఇది.. బెడ్‌పై చావు బతుకుల్లో, ఊ అంటావా మావా అంటోన్న బామ్మగారు
సరిగ్గా మూడేళ్ల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్ ( పుష్ప పార్ట్ 1) యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన సంగతిని ఎవరూ మరిచిపోరు. 1980వ దశకంలో శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ ఇతివృత్తంతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కథ, కథనంతో పాటు పుష్ప పార్ట్ 1లోని పాటలు, మాటలు సమాజంపై ప్రభావం చూపాయి. ఈ సినిమాలోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్, నీ యవ్వ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులను చిన్నా పెద్ద రీల్స్ చేసి మురిసిపోయారు. ఇక రాజకీయ నాయకులు కూడా పుష్ప డైలాగులను తమ ఎన్నికల ప్రచారంలో చెప్పారంటే పుష్పగాడు చేసిన మేజిక్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతలా దేశాన్ని మెస్మరైజ్ చేసిన పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తొలుత ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా పుష్ప-2 విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ సంచలన ప్రకటన చేయడంతో టాలీవుడ్ , బన్నీ ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ మూవీని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించడంతో ప్రేక్షకులు బాగా డిజప్పాయింట్ అయ్యారు.
అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో పాటు తదనంతరం జరిగిన పరిణామాలతో మెగా , పవన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఈ పరిస్ధితుల్లో పుష్ప 2ని రిలీజ్ చేస్తే ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, అన్ని లెక్కలు వేసుకుని సినిమాను డిసెంబర్‌కు వెనక్కి జరిపారని సోషల్ మీడియాలో నేటీకి చర్చ నడుస్తోంది. కానీ పుష్ప ది రూల్ వాయిదా పడటానికి అసలు కారణాలేంటీ అనేది మాత్రం బయటకు రాలేదు.
Orey entra edhi Krishna Rama anukuney vayasuro oo antava endi ra 😂😂😂#Pushpa2ThaRule @alluarjun @iamRashmika @MythriOfficial pic.twitter.com/vUiwrR0ym1
— AA /// Cult Fan (@Kondareddanna2) October 21, 2024
ఇకపోతే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారిలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటన, డైలాగ్స్, డ్యాన్స్‌ని బాగా ఇష్టపడతారు. ఈ క్రమంలోనే ఓ పెద్దావిడ అల్లు అర్జున్‌పై అభిమానం చాటుకున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు హాస్పిటల్ బెడ్‌పై చావు బతుకుల మధ్య ఉంటారు. శరీరం మొత్తం సెలైన్లు, ఇతర పైపులు బిగించి ఉంటాయి.
ముక్కులో నుంచి గొంతులోకి మరో పైప్ దించినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఎవరైనా తనను త్వరగా ఇంటికి చేర్చమని భగవంతుడిని కోరుకుంటారు. కానీ ఈ పెద్దావిడ మాత్రం ఆ స్ధితిలోనూ పుష్ప పార్ట్ 1లోని 'ఊ అంటావా మావ' అనే పాటను పాడుతూ బాధను మరిచిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్స్ వేయగా.. ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు.


Click it and Unblock the Notifications











