సీనియర్ ఫిలిం జర్నలిస్టు వడ్డి ఓంప్రకాశ్‌కు అరుదైన గౌరవం.. సీబీఎఫ్‌సీ సభ్యుడిగా నియామకం
తెలుగు ఫిలిం జర్నలిస్టు, సినీ విశ్లేషకుడు ఓం ప్రకాశ్ వడ్డికి అరుదైన గౌరవం దక్కింది. గత మూడు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవలు అందిస్తున్న ఆయన కేంద్ర సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ఛానెల్ ఎన్టీవీలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయ లోకం ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఉన్నత పదవికి ఎంపికైన వడ్డి ఓం ప్రకాశ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
వడ్డి ఓం ప్రకాశ్ కెరీర్ విషయానికి వస్తే.. వార్త, సూపర్‌హిట్, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పనిచేవారు. ప్రస్తుతం ఎన్టీవీలో సేవలందిస్తున్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా జాగృతి వార పత్రికలో చిత్ర సమీక్షలు రాస్తున్నారు. సినీ జర్నలిస్టుగా విశేష సేవలు అందించినందుకు, విశేష అనుభవం ఉన్న నేపథ్యంలో ఈ అవార్డు ఆయనను వరించింది.

ఓం ప్రకాశ్ వడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఉన్న అనుభవంతో ఈ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను. సీబీఎఫ్‌సీ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ కావడానికి కారకులైన సంస్కార భారతి దక్షిణ మధ్య క్షేత్ర మాజీ సహ ప్రముఖ్ శ్రీ కుమారస్వామికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని అన్నారు.



Click it and Unblock the Notifications











