ఓ మై గాడ్ అంతా ఈ రోజే.. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్స్ వైరల్
అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి రూపంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టిన అల్లు అర్జున్- త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ కావడం మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ అప్‌డేట్స్ ఫుల్ ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేశారు మేకర్స్. తాజాగా మరో పాటకు ముహూర్తం పెట్టేసి అల్లు అర్జున్ స్టైలిష్ లుక్స్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్ ద్వారా చిత్రం లోని మూడో పాట 'ఓ మైగాడ్ డాడీ' ఫుల్ వీడియోని ఈ రోజు (నవంబర్ 22) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఫుల్ వీడియో కోసం యమ ఆసక్తిగా సెకనులు లెక్కపెట్టుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
'ఓ మైగాడ్ డాడీ' పాటకు తమన్ సంగీతం అందించగా.. రోల్ రిడా, రాహుల్ సిప్లిగంజ్, బ్రేజీ, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్‌లు ఆలపించారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన 'అల.. వైకుంఠపురములో' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











