భయపెట్టేందుకు సిద్దమైన రాజుగారి గది.. రిలీజ్ డేట్ ఫిక్స్
యాంకర్‌గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఓంకార్.. మెగా ఫోన్ పట్టి దర్శకుడి అవతారమెత్తాడు. డిఫెరెంట్ జానర్‌లో హారర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో 'రాజుగారి గది' సిరీస్ మొదలు పెట్టారు. ఆయన చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ కావడంతో ఇప్పటికే ఈ సిరీస్ నుండి రెండు భాగాలు రిలీజ్ చేసి భేష్ అనిపించుకున్నారు. ఇక మూడో భాగం షూటింగ్ కూడా ఇటీవలే మొదలుపెట్టిన ఓంకార్ 'రాజుగారి గది 3' ని కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రెడీ అయ్యాడు.
హారర్ జానర్ లోనే విభిన్న కథాంశాన్ని ఎన్నుకొని ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసిన ఓంకార్ జూన్ 20వ తేదీన 'రాజుగారి గది 3' సినిమాను లాంఛనంగా ప్రారంభించి త్వర త్వరగా ఫినిష్ చేశాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అక్టోబర్ 18వ తేదీన 'రాజుగారి గది 3' సినిమాను విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో రాజుగారి గది, రాజుగారి గది 2, రాజుగారి గది 3 మూడింటినీ కలుపుతూ చూపించి ఆసక్తి రేకెత్తించారు.

ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ఫేం అవికా గోర్, ఓంకార్, అశ్విన్ బాబు లీడ్ రోల్స్ పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, ఇతర అప్‌డేట్స్ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో సినిమా విడుదల పట్ల ప్రేక్షకుల్లో ఒకరమైన ఆసక్తి క్రియేట్ అయింది.
రాజుగారి గది సిరీస్ నుంచి వచ్చిన గత సినిమా 'రాజుగారి గది 2' మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ, ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రాజుగారి గది 3 సినిమా రూపొందించాలని ఫిక్స్ అయిన ఓంకార్ ఈ సినిమా పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని అంటోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











