మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. చేయి పోగొట్టుకున్న విద్యార్థికి అండగా..

ప్రముఖ నటుడు సోనుసూద్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్న కూడా తన వద్దకు వస్తే తప్పకుండా తోచినంత సహాయం చేస్తాను అని గత రెండేళ్లుగా ఎన్నో మంచి పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ నుంచి సోను సూద్ పేదలకు అండగా నిలుస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో ఎంతమంది స్వగ్రామానికి చేరుకునేందుకు రోడ్డు బాట పట్టినప్పుడు ప్రత్యేకంగా వారి కోసం రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎంతో మందికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యాలను కల్పించారు. విదేశాల్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా విమానాలలో స్వదేశానికి తీసుకు వచ్చాడు. కరోనా లాక్డౌన్ సమయంలోనే కాకుండా తర్వాత కూడా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాడు.

ఒకవైపు నటుడిగానే కాకుండా మరొక వైపు మంచి సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా తెలంగాణలోని ఒక విద్యార్థికి కూడా ప్రత్యేకంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. సివిల్స్ లక్ష్యంగా ఎంతో కష్టపడి చదువుతున్న యువ విద్యార్థి ఇటీవల అనుకోని ప్రమాదానికి గురవ్వడంతో అతని చేయి పోగొట్టుకున్నాడు. అయితే అతనికి అండగా నిలిచేందుకు సోనూసూద్ బాధ్యత తీసుకున్నాడు.

Once again actor Sonu sood helped to telangana student

కృత్రిమ చేతిని అమర్చేందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. జనగామ లోని మరిగడి గ్రామానికి చెందిన చామకూర శ్రీహరి గత కొంతకాలంగా సివిల్స్ లో ర్యాంక్ సాధించేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన శ్రీహరి అక్కడ ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. అయితే గ్రామంలో పండుగ సందర్భంగా స్వగ్రామానికి తిరిగి వచ్చిన శ్రీహరి వరి కోత కోసం పొలానికి వెళ్ళాడు.

అయితే వరిగడ్డిని చుట్టలుగా చుట్టే యంత్రం మిషన్ దగ్గర శ్రీహరి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అతని చేయి పడిపోయి చేయికి తీవ్రంగా గాయమైంది. అతని చేయి దాదాపుగా యంత్రంలో పడిపోయి నుజ్జు నుజ్జు అయిపోయింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు. సివిల్స్ లో సత్తా చాటాలని కష్టపడుతున్న కుమారుడు హఠాత్తుగా ప్రమాదానికి గురికావడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర మనోవేదనకు గురి అయింది. అయితే ఈ క్రమంలో ఆ విద్యార్థి గురించి తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వారికి సహాయం అందించాలని సోనూసూద్ ట్రస్ట్ కు సమాచారం ఇచ్చారు.

సోషల్ మీడియాలో సదరు సంస్థ ఈ ఘటనపై స్పందించి తప్పకుండా సహాయం చేస్తామని కూడా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సోనూసూద్ దుబాయ్ లో ఉన్నాడు అని ఆయన ట్రస్ట్ నుంచి తమకు ఫోన్ వచ్చింది అని శ్రీహరికి తప్పకుండా రోబోటిక్ హ్యాండ్ అందిస్తామని హామీ ఇచ్చినట్లు వారి కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. ఇక ఈ సహాయం చేస్తున్నందుకు కోమటిరెడ్డికి అలాగే ఆదుకుంటున్న సోనూసూద్ కు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఇటీవల ఆచార్య సినిమాలో సోనూసూద్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే అతను మరికొన్ని సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X