బాహుబలి, శ్రీదేవి పాత వివాదాన్ని తెరపైకి తెచ్చిన బోనీ కపూర్.. RRR రాజమౌళిపై ఘాటు వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కానీ తేడా వస్తే ఎదో ఒక సినిమాపై తీవ్ర ప్రభావం చూపక తప్పదు. నిజానికి ఒక సినిమాకు కలెక్షన్స్ భారీగా రావాలి అంటే అన్నిటి కంటే ముఖ్యమయ్యింది రిలీజ్ డేట్. హిట్ టాక్ అనేది ఎప్పుడు రిలీజ్ అయినా వస్తాయి. కానీ సరైన సమయంలో సినిమాను విడుదల చేయకపోతే మాత్రం భారీగా నష్టాలు తప్పవు. ఇక RRR రిలీజ్ డేట్ ను ప్రకటించారో లేదో అప్పుడే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాత శ్రీదేవి భర్త బోనీ కపూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాజమౌళి అన్ ప్రొటోఫెషినల్ అంటూ శ్రీదేవిపై గతంలో రాజమౌళి చేసిన కామెంట్స్ పై కూడా ఘాటుగా స్పందించారు.
Recommended Video

మైదాన్ vs RRR
అక్టోబర్ 13న RRR సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అసలైతే సంక్రాంతికే రావాలని అనుకున్నారు గాని అప్పుడు కొన్ని రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉన్నాయని వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు ఫిక్స్ చేసిన డేట్ కు మరో బాలీవుడ్ సినిమా రానుంది. అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన మైదాన్ సినిమా అక్టోబర్ 15న రానుంది. రెండు సినిమాలు క్లాష్ అవ్వడం చాలా రిస్క్ అని ఆ సినిమా నిర్మాత బోనీ కపూర్ ఆరోపిస్తున్నారు.

ఎవరికి శ్రేయస్కరం కాదు
మైదాన్ సినిమా ఫుట్‌బాల్ లెజెండ్ అబ్దుల్ రహిం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే మైదాన్ చిత్ర నిర్మాత బోణి కపూర్ RRR రిలీజ్ డేట్ పై కొన్ని రోజుల క్రితం అసంతృప్తి వ్యక్తం చేశారు. RRR సినిమా కంటే ముందే మేము రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశాము. రెండు పెద్ద సినిమాలు ఓకే సమయంలో క్లాష్ అవ్వడం ఎవరికి శ్రేయస్కరం కాదు అంటూ RRR రిలీజ్ డేట్ చెప్పిన రోజే వివరణ ఇచ్చారు.

బాహుబలి, శ్రీదేవి వివాదం
ఇక మరోసారి బోనీ కపూర్ శ్రీదేవికి రాజమౌళికి సంబంధించిన పాత వివాదాన్ని కూడా తెరపైకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి సినిమాల్ శివగామి పాత్రకు మొదట శ్రీదేవిని అడిగిన విషయం తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి శ్రీదేవి రెమ్యునరేషన్ భారీగా అడిగారని, కాస్ట్లీ హోటల్ లో ఒక ఫ్లోర్ మొత్తం బుక్ చేయమని డిమాండ్ చేశారని అడుగగా వెనక్కి తగ్గినట్లు జక్కన్న తెలిపారు.

బాహుబలి కథపై ఇంట్రెస్ట్ చూపలేదు
అయితే రాజమౌళి అప్పుడన్న మాటలను కూడా బోనీ కపూర్ ఇప్పుడు గుర్తు చేస్తూ రాజమౌళి అన్ ప్రొఫెషినల్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. రాజమౌళి బాహుబలి కథ చెప్పినపుడు శ్రీదేవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. నేనే మగధీర ఈగ సినిమాలను చూపించి చేయమని చెప్పా. అయితే శ్రీదేవి కథలో కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చిన తరువాత రాజమౌళి నుంచి నాకు మెస్సేజ్ వచ్చింది. శ్రీదేవిపై నాకు ఇంకా నాకు గౌరవం పెరిగిందని రాజమౌళి నాకు మెస్సేజ్ చేశాడు.

చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తామన్నారు
అయితే ఆ తరువాత శ్రీదేవి రేంజ్ కంటే చాలా తక్కువ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారు. నిజంగా అది ఇన్సల్ట్ చేయడం లాంటిదే. దాని గురించి మేము ఎక్కువగా ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడలేదు. ఆ విషయం గడిచిపోయింది. అది పక్కన పెడితే రాజమౌళి టోటల్లీ అన్‌ప్రొఫెషనల్.. సీనియర్ల పట్ల గౌరవం లేదని అర్ధమయ్యింది. ఐ థింక్... సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ మ్యాన్.. శ్రీదేవి అన్‌ప్రొఫిషనల్ అనే కామెంట్ చేసినట్లు కూడా నా వరకు వచ్చింది. ఆమె అలాంటిది అయితే అన్నేళ్లు ఇండస్ట్రీలో ఒక స్టార్‌లా ఎలా ఉండగలుగుతుంది? అని బోనీ కపూర్ ప్రశ్నించారు.

రాజమౌళికి కాల్ చేశా
నేను రాజమౌళి RRR రిలీజ్ డేట్ విషయంపై కాల్ చేసి మాట్లాడితే ఒకసారి షాట్ లో బిజీగా ఉన్నారని అన్నారు. అనంతరం కాల్ బ్యాక్ చేసి సినిమా రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే నిర్మాతలు నష్టపోవాల్సి ఉంటుందని చెప్పా. కానీ ఆయన తన నిర్ణయం కాదని అంటూ రిలీజ్ డేట్ పూర్తిగా నిర్మాతదే అన్నారు. పైగా పంపిణీదారులు కూడా ఒత్తిడి చేయడం వల్ల ఆ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తనతో చెప్పినట్లు బోనీ కపూర్ వివరణ ఇచ్చారు. కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా అలా ఒత్తిడి చేయరని ఆయన అన్నారు.

రాజమౌళి లాంటి వ్యక్తులపై నాకు గౌరవం ఉండదు
అంతే కాకుండా మైదాన్ రిలీజ్ డేట్ పై అజయ్ దేవ్ గన్ , రాజౌళికి ముందే చెప్పారని చెప్పిన బోణి కపూర్ రాజమౌళి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే దానికి రాజమౌళి బాధ్యత లేకుండా వ్యవహరించారని అన్నారు. ఇది వృత్తి విరుద్ధం అనైతికం అంటూ రాజమౌళి లాంటి వ్యక్తులపై తనకు ఏ మాత్రం గౌరవం ఉండదని కూడా బోనీ కపూర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











