Bheemla Nayak: రిలీజ్ డేట్ పై మరో క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్.. తగ్గేదే లే!

కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో మార్కెట్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. ముఖ్యంగా సినిమాల విడుదల తేది లపై ప్రస్తుతం ఒక పోరాట యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఫెస్టివల్ సీజన్ చాలా క్లిష్టంగా మారింది. తప్పనిసరిగా విడుదల చేస్తూ ఉండడంతో మరికొన్ని పెద్ద సినిమాలతో పోటీ పడక తప్పడంలేదు. అయితే కొంతమంది చర్చలతో రిలీజ్ డేట్ ను మార్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఎన్ని చర్చలు జరిపిన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పోటీ ఎంత ఉన్నా కూడా ఫెస్టివల్ సీజన్ లోనే రావాలని చాలా బలంగా నిర్ణయం తీసుకుంటున్నారు.

ఇక సంక్రాంతి ఫెస్టివల్ కూడా చాలా కీలకం కానుంది. ఆ సీజన్లో వచ్చే ప్రతి సినిమా కూడా ఎంతో కొంత వసూళ్లను అయితే అందుకుంటుంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా భారీ స్థాయిలో లాభాలు వస్తాయి అని అనేక సార్లు రుజువైంది. 2022 సంక్రాంతి సీజన్లో కూడా పోటీకి రావడానికి చాలా మంది హీరోలు సిద్ధంగా ఉన్నారు. అయితే ముందుగా అనుకున్న డేట్స్ అయితే కొన్ని మార్చక తప్పలేదు. ముఖ్యంగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి రావాలని ముందుగానే ప్రకటన కూడా ఇచ్చాడు. కానీ పెద్ద సినిమాల హడావుడి ఎక్కువ కావడంతో మహేష్ బాబు రిస్క్ చేయలేక సమ్మర్ లోకి తన సినిమాను వాయిదా వేసుకున్నాడు.

once again clarification on Bheemla nayak sankranthi release date

జనవరి 7వ తేదీన రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన RRR సినిమా వస్తుండడంతో ఆ సమయంలో ఏ సినిమా వచ్చినా కూడా కాస్త రిస్క్ అనే చెప్పాలి. అందుకే మహేష్ బాబు సంక్రాంతి పోటీ నుంచి తప్పించుకున్నాడు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని మరోసారి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి . అయితే ఈ సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు ఇటీవల అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

once again clarification on Bheemla nayak sankranthi release date

అంతే కాకుండా నిర్మాతల మధ్య చర్చలు కూడా జరిగాయి కానీ సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవడం లేదని తప్పకుండా జనవరి 12న అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక రాధేశ్యామ్ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలు అయితే ఈ సినిమాను జనవరి 16 వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు కానీ సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవడంతో రాధేశ్యామ్ నిర్మాతలు నిర్ణయాన్ని మార్చుకున్నారు. చూస్తుంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ లో బాక్సాఫీస్ స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏ సినిమా అత్యధిక లాభాలను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X