రాజ్ తరుణ్ అందుకే నా దగ్గరకి రావట్లేదు.. యంగ్ హీరోయిన్‌పై లావణ్య సంచలన ఆరోపణలు

రీసెంట్ గా తెలుగు సినిమా దగ్గర కాస్త ఎక్కువగా వినిపించిన పలు షాకింగ్ కాంట్రవర్సీలలో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ కోసమే అని చెప్పాలి. తన కొత్త సినిమాలు ఈ మధ్యలోనే రెండు వచ్చినప్పటికీ వాటిని మించిన అటెన్షన్ ని రాజ్ తరుణ్ తన కొత్త కాంట్రవర్సీతో అందుకున్నాడు.

కాగా ఆమె తన మాజీ ప్రేయసి లావణ్య విషయంలో చేసిన పని అలాగే ఆమె రాజ్ తరుణ్ విషయంలో చేసిన పనికి గాను ఇద్దరూ పరస్పరంగా కేసులు వేసుకొని రోజుకో కొత్త ట్విస్ట్ ని తమ ప్రేమకథలో చూపిస్తూ వచ్చారు. కాగా ఈ కేసుల విషయంలో వీరిద్దరితో పాటుగా యంగ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా అనే నార్త్ బ్యూటీ పేరు కూడా గట్టిగా వినిపించడంతో మొత్తం మంచి రసవత్తరంగా మారిపోయింది.

once again lavanya made shocking comments on malvi malhotra and raj tarun

ఇలా గత కొన్ని వారాలు నెలల నుంచి వీరి కాంట్రవర్సీ కొనసాగుతుండగా లేటెస్ట్ గా లావణ్య చేసిన మరో ఆరోపణ మాల్వి మల్హోత్రా విషయంలో వైరల్ గా మారింది. తాను ఇప్పటికీ రాజ్ ని కావాలి అనుకుంటున్నాను కానీ రాజ్ మాత్రం నా దగ్గరకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇంతకు ముందు ఇలా ఉండేవాడు కాదని దీనికి కారణం ఆ మాల్వి మల్హోత్రానే అంటూ ఆరోపించింది.

రాజ్ తరుణ్ ని ఆమె సొంతం చేసుకోవడానికి మాల్వి ఏదో చేతబడి చేయించింది అని అందుకే రాజ్ నా దగ్గరకి రావడం లేదు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంటే రాజ్ తరుణ్ మాల్విని వదలకుండా ఉండేలా ఏదో మందో మాకో పెట్టించింది అన్నట్టుగా లావణ్య అంటుంది. ఇక దీనితో పాటుగా ఇటీవల ఆమె డైరెక్ట్ గా రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఇంట్లో ఉండగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వీడియో రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చింది.

దీనితో ఈ వీడియో ఒకసారిగా వైరల్ గా కూడా మారింది. ఇలా ప్రస్తుతం వీరి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ రోజుకో కొత్త మలుపుతో వెళుతుంది అని చెప్పాలి. ఇక ఫైనల్ గా న్యాయం ఎవరి వైపు నిలుస్తుందో చూడాలని నెటిజన్స్ కూడా వీరి విషయంలో ఆసక్తిగా ఉన్నారు. కాగా రాజ్ తరుణ్ నటించిన రెండు చిత్రాలు "పురుషోత్తముడు", అలాగే "తిరగబడరా సామి" లతో రిలీజ్ కి వచ్చాడు.

once again lavanya made shocking comments on malvi malhotra and raj tarun

వీటిలో ఇప్పుడు లావణ్య ఎవరైతే హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేస్తుందో ఆమెతో "తిరగబడరా సామి" లో నటించింది. మరి ఈ సినిమాలో వారిద్దరి రొమాన్స్ లు, ఇంకొన్ని డీప్ సీన్స్ చూస్తే ఈ సినిమా నుంచి అంతా మొదలైంది అన్నట్టుగా కూడా ఓ టాక్ ఉంది. దీనితో లావణ్య మరింత గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఇక రెండు సినిమాలు తర్వాత ఇదే కాంట్రవర్సీల నడుమే రాజ్ తరుణ్ తన మూడో సినిమాతో వచేస్తున్నాడు. ఆ సినిమానే "భలే ఉన్నాడే". దర్శకుడు మారుతి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 13న రిలీజ్ కి రాబోతుంది.

More from Filmibeat

Read more about: raj tarun malvi malhotra lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X