‘విరాట పర్వం’ కోసం ఓటీటీ సంస్థ విశ్వ ప్రయత్నాలు: మరో భారీ ఆఫర్‌తో ముందుకు
చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయినప్పటికీ.. భారీ స్థాయిలో సోలోగా హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. ఇలాంటి పరిస్థితుల్లోనే వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయినప్పటికీ అతడికి బిగ్ బ్రేక్ మాత్రం దూరంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానా.. సున్నితమైన ప్రేమకథతో చేసిన చిత్రమే 'విరాట పర్వం'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీని కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యూస్ ఒకటి లీకైంది.
'విరాట పర్వం' సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ చిత్ర యూనిట్‌తో సంప్రదింపులు జరిపింది. కానీ, ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ఆఫర్‌తో 'విరాట పర్వం' హక్కులను కోరినట్లు తెలుస్తోంది. ఊహించని మొత్తం ముట్టజెప్పేందుకు ముందుకు రావడంతో చిత్ర యూనిట్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.

ఇక, నక్సలైట్ ఉద్యమానికి సున్నితమైన ప్రేమకథను జోడించి తెరకెక్కించిన 'విరాట పర్వం'లో రానాకు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు. ఇందులో రానా నక్సలైట్ రవన్నగా నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











