Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొన్న గోవా ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే.. కాబోయే భర్తతో నిహారిక.. అస్సలు తగ్గట్లేదుగా
మెగా ఫ్యామిలీలో చాలా రోజుల తరువాత ఒక గ్రాండ్ ఫెస్టివల్ జరగబోతోంది. ఆ వేడుక మరేదో కాదు.. నిహారిక పెళ్లి. పెళ్లి వేడుకలను మెగా కుటుంబ సభ్యులు ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిశ్చితార్థం వేడుకల నుంచే వారికి సంబంధించిన స్పెషల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక నిహారిక తనకు కాబోయే వాడితో ఉన్న ఫొటోలు కూడా బాగానే ట్రెండ్ అవుతున్నాయి.
గ్యాప్ లేకుండా సెలబ్రేషన్స్
చైతన్య నిహారికకు ఎంతగా నచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే మ్యాచ్ సెట్టయ్యిందో అప్పటి నుంచి అతని ధ్యాసలోనే ఉన్నట్లు ఆమె నవ్వును చూస్తేనే అర్ధమవుతోంది. ఇక అల్లరిగా కనిపించే నిహారిక పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి అప్పుడప్పుడు సిగ్గుపడుతూ కాబోయే భర్తతో ఫొటోలకు స్టిల్ ఇస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో గ్యాప్ లేకుండా ఆమె తన భావాలను వ్యక్తపరుస్తోంది.
ఫ్రెష్ లవ్ బర్డ్స్..
ఇక మొన్న గోవాకు బ్యాచిలర్ పార్టీ కోసమని కాబోయే వాడితో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే తన ప్రాణ స్నేహితులకు అమ్మడు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఇక చైతన్య అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. చూస్తుంటే ఎప్పటి నుంచో వీరిద్దరు ప్రేమికులుగా ఉన్నారని నెటిజన్లు స్వీట్ గా కామెంట్స్ చేశారు. నిజాంగా ఒక ఫ్రెష్ లవ్ బర్డ్స్ అనే కామెంట్స్ కూడా వచ్చాయి.
పెళ్లి తరువాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో..
ఇక గోవా అనంతరం చైతన్య, నిహారిక దీపావళి సందర్భంగా మళ్ళీ ఒకటిగా కనిపించారు. పండగరోజు ఇద్దరు ట్రెడిషినల్ లుక్ లో దర్శనమిచ్చిన విధానం నెటిజన్లను కూడా బాగానే ఎట్రాక్ట్ చేసింది. నిహారిక స్పెషల్ గా ఒక ముగ్గు కూడా వేసింది. ఆ ఫొటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెల్లిపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి కాబోయే వాడితో నిహారిక ప్రతి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. మరి పెళ్లి తరువాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో ఈ సెలబ్రేషన్స్.
Recommended Video
పెళ్లి ఎప్పుడు..ఎక్కడ..?
ఇక పెళ్లి విషయానికి వస్తే.. నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నగడ్డ డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మూడు ముళ్లు వేయబోతున్నారు. ఇటీవల అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. చైతన్య తండ్రి పెళ్లి ముహూర్తం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.