మళ్ళీ మొదటికొచ్చిన రాజమౌళి RRR ప్లాన్.. షూటింగ్ క్యాన్సిల్?
రాజమౌళి పాన్ ఇండియా మూవీ RRR షూటింగ్ ప్లాన్స్ మళ్ళీ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికీ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యేవారు. కానీ లాక్ డౌన్ తరువాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత కూడా షూటింగ్ స్టార్ట్ కాలేదని సమాచారం.
చాలా వరకు ఇండస్ట్రీలో కొన్ని సినిమా షూటింగ్స్ చాలా తక్కువమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులతోనే జరుగుతున్నాయి. ఇక RRR ఎట్టకేలకు పట్టాలెక్కిందని అనుకునే లోపే ఊహించని విధంగా బ్రేక్ పడింది. సినిమాకు సంబంధించిన ట్రయల్ షూటింగ్ సోమవారం, మంగళవారం చేయాలని అనుకున్నారు. కానీ అందుకు పోలీసుల నుంచి ఫుల్ పర్మిషన్ లభించలేదట.

ఎందుకంటే రాజమౌళి RRR సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం చాలా మంది అవసరం ఉందట. కేవలం 50 మంది అంటే అస్సలు కుదరదని అంతకంటే ఎక్కువ మంది అవసరం ఉందట. అయితే భారీ స్థాయిలో షూటింగ్స్ చేయాలి అంటే కరోనా ప్రభావం కాస్త తగ్గేవరకు ఓపిక పట్టాల్సిందేనని అధికారుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయట. ఇక రిస్క్ చేయకూడదని రాజమౌళి కూడా షూటింగ్ ప్లాన్ ని మరోసారి చేంజ్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











