ఒరిజినలేనా అన్నాడు.. వెంటనే విప్పి చూపించనా అనేశా.. బాబోయ్! శ్రీరెడ్డి రచ్చ రచ్చ
Recommended Video
టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి తీరు అందరికీ తెలిసిందే. ఆమె నోరు విప్పిందంటే ఇక అందరూ చెవులు మూసుకోవాల్సిందే. కాస్టింగ్ కౌచ్ అంటూ ఓ గొప్ప ఉద్యమానికి తెరలేపి తారా స్థాయికి తీసుకెళ్లిన ఈమె ఇటీవలే హైదరాబాద్ వదిలి చెన్నైలో సెట్ అయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీ లోని అందరినీ కడిగిపడేస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన విషయాలు బయటపెట్టింది. ఆ వివరాలు చూస్తే..

బిగ్ బాస్‌పై విమర్శల వర్షం
తాజాగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో తెలుగు బిగ్ బాస్ షోపై మరోసారి విరుచుకు పడుతూ విమర్శల వర్షం గుప్పించింది శ్రీ రెడ్డి. ఇప్పటికే ఈ షోపై, షో నిర్వాహకులపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన ఈమె.. ఇప్పుడు నేరుగా మాటల యుద్ధం చేసేసింది. ఆమె మాట్లాడిన తీరు, చెప్పిన విషయాలు ప్రస్తుతం ఓ రేంజ్ చర్చలకు తెరలేపాయి.

హోటల్‌కి రమ్మన్నాడు.. నేరుగా అడిగేశాడు
బిగ్ బాస్ సీజన్ 3లో ఆఫర్ ఇస్తానని తనను సంప్రదించిన కొందరు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ ఏరియాలో ఉన్న ఓ హోటల్‌కి రమన్నారని పేర్కొంది శ్రీ రెడ్డి. అయితే వాళ్ళు పిలిచిన ప్రకారంగా తాను వెళ్లడం జరిగిందని, అక్కడ బిగ్ బాస్ షోకి సంబందించిన ఓ వ్యక్తి హౌస్ లోకి వెళ్ళాక చాలా కనెక్షన్స్ పెట్టుకోవాలి. నీకిష్టమేనా? అని నేరుగా అడిగేశాడని చెప్పింది.

ఆ మాట అనడంతో షాకయ్యా
అంతటితో ఆగక నీ వ*** ఒరిజినలా లేదా సర్జరీ చేయించావా? అని ఆ వ్యక్తి అనడంతో షాకయ్యానని చెప్పింది శ్రీ రెడ్డి. దానికి వెంటనే విప్పి చూపించనా అంటూ సీరియస్‌గా రిప్లై ఇచ్చానని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే ఎలాగోలా చివరకు వాళ్లు నన్ను తీసుకోకపోవడం ఒకరకంగా మంచిదే అయ్యిందని, ఇప్పుడు బిగ్ బాస్.. నిజంగానే బ్రోతల్ హౌస్‌లాగే ఉందని సంచలనంగా మాట్లాడింది శ్రీ రెడ్డి.

గతంలో అలా.. ఇప్పుడిలా
బిగ్ బాస్ షో పై శ్రీ రెడ్డి ఇలా ఆరోపణలు చేయడం కొత్తేమీకాదు. గతంలో సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ గురించి ఓ రేంజ్ కామెంట్లు చేసింది శ్రీ రెడ్డి. అంతేకాదు బిగ్ బాస్ పై పోరాటం చేసిన యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తాలకు సపోర్ట్ కూడా చేసింది. గతం సంగతేమైనా ఇప్పుడు నేరుగా ఇలా శ్రీ రెడ్డి సెన్సేషనల్‌గా మాట్లాడటం జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

చివరి వరకు వెళ్లేసరికి ఇంకెన్ని కామెంట్స్ చేస్తుందో..
అదును చూసి ఇలా శ్రీ రెడ్డి చేస్తున్న కామెంట్లు బిగ్ బాస్ అభిమానుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఓ పక్క షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంటే శ్రీ రెడ్డి ఈ రకంగా కామెంట్స్ చేయడం జీర్ణించుకోలేక పోతున్నారు కొందరు. ఆమె తీరు చూసి చివరి వరకు వెళ్లేసరికి ఇంకెన్ని కామెంట్స్ చేస్తుందో అని భయపడుతున్నారు కూడా!.


Click it and Unblock the Notifications











