నా పెళ్లి కూడా అక్కడే.. రానా బావ అంటూ మరో బాంబ్ పేల్చిన శ్రీ రెడ్డి
వివాదాల శ్రీ రెడ్డి మరోసారి దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీ సంబంధించిన ఏ విషయం హాట్ టాపిక్ అయినా కూడా ఆ మ్యాటర్ పై సెటైర్స్ వేయడం ఈమెకు అలవాటే.. ఇప్పుడు రానా దగ్గుబాటి పెళ్లి వేడుకలు మొదలవ్వడంతో కామెంట్స్ శ్రీ రెడ్డి డోస్ కూడా పెంచింది. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.
Recommended Video

ఎంగేజ్మెంట్..
రానా దగ్గుబాటి మిహికా బజాజ్ నిశ్చితార్థం నేడు సాయంత్రం రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఈ వేడుకకు చాలా తక్కువమంది హాజరు కానున్నారు. కేవలం దగ్గుబాటి అలాగే మిహికా కుటుంబ సభ్యులు మాత్రమే నిశ్చితార్థంలో పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై శ్రీ రెడ్డి తనదైన శైలిలో కామెంట్ చేసింది.

రానా బావా..
రానా మిహికా ఎంగేజ్మెంట్ పై గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక శ్రీ రెడ్డి కూడా వాటిపై స్పందిస్తూ.. మరో బాంబ్ పేల్చింది. ఈ రోజు రానా బావా ఎంగేజ్మెంట్ అంటూ.. నెక్స్ట్ రామానాయుడు స్టూడియోలో జరగబోయే పెళ్లి నాదేనని శ్రీ రెడ్డి తన ఫెస్ బుక్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆ కామెంట్స్ పై నెటీజన్స్ వివిధ రకాలుగా ఆన్సర్ ఇస్తున్నారు.

స్పెషల్ టార్గెట్..
గతంలో రానా తమ్ముడు అభిరామ్ తనను ప్రేమించడాని శ్రీ రెడ్డి ఎవరు ఊహించని విదంగా ఫొటోలు లీక్ చేసిన విషయం తెలిసిందే. ఆ వివాదం మీడియా ఛానెల్స్ లో అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఆ తరువాత శ్రీ రెడ్డి ట్రాక్ వివిధ రూపాల్లోకి మారి చెన్నైకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రానా పెళ్లి వేడుకలు జరుగుతుండడంతో శ్రీ రెడ్డి రోజుకో కామెంట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

రానా పెళ్లి ఎప్పుడంటే..
ఇక రానా ఎంగేజ్మెంట్ చేసుకున్న తరువాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ వివరాలన్నీ లాక్ డౌన్ అనంతరం తెలియనున్నాయి. ముందుగా ఎంగేజ్మెంట్ పనులను పూర్తి చేసుకొని కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత రానా, మిహికా పెళ్లి జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











