twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యయ్యో.. కాపీ కొట్టేసి మళ్ళీ దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్ మామూలుగా లేదు!

    |

    సంగీత దర్శకుడు థమన్ పై కాపీ ఆరోపణలు ఎన్ని సార్లు వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా నుంచి కూడా ఏదో ఒక రకంగా ట్రోలింగ్ కు గురవుతున్న థమన్ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా థమన్ మళ్ళీ కాపీ కొట్టి దొరికినట్లు ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ వస్తున్నాయి. సాంగ్ విడుదలైన కొన్ని గంటల నుంచే అనేక రకాల మీమ్స్ కూడా మొదలయ్యాయి.

     రవితేజ సినిమాలోనే మరో కాపీ సాంగ్

    రవితేజ సినిమాలోనే మరో కాపీ సాంగ్

    గత ఏడాది నుంచి టాలీవుడ్ లో బిజీగా ఉంటున్న థమన్ సంగీత దర్శకుల్లో టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. కిక్ సినిమాతో మొదట తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ మొదటి అవకాశం రావితేజ ఇవ్వడం వలన నిత్యం అతనికి రుణపడి ఉంటానని చెబుతూ ఉంటాడు. అయితే ఈ సారి రవితేజ సినిమాకు సంబంధించిన పాట కోసం మరో సాంగ్ నుంచి ట్యూన్స్ కాపీ కొట్టినట్లు ట్రోలింగ్ నడుస్తోంది.

    అనిరుధ్ తో పాడించిన ఆ పాట..

    అనిరుధ్ తో పాడించిన ఆ పాట..

    రవితేజ నటించిన క్రాక్ సినిమా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న మాస్ రాజా టీజర్ పోస్టర్స్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఇక ఆ తరువాత విడుదలైన భూమ్ బద్ధల్ సాంగ్ కి మంచి క్రేజ్ దక్కింది. ఇక రెండవ సాంగ్ ను అనిరుధ్ తో పాడించారు. కానీ ఆ సాంగ్ కాపీ క్యాట్ అని తేలిపోయింది.

    ట్యూన్స్ కాపీ అంటూ.. ట్రోలింగ్స్

    ట్యూన్స్ కాపీ అంటూ.. ట్రోలింగ్స్

    'బల్లేగా తగిలావే బంగారం' అంటూ అనిరుధ్ రవిచందర్ తో పాడించిన ఆ పాటకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ విడుదలైన కొన్ని గంటలకే కాపీ క్యాట్ ఆరోపణలు మొదలయ్యాయి. ఆ సాంగ్ (selva el neon) సెల్వ ఎల్ నియోన్' అనే పాట నుంచి ట్యూన్స్ కాపీ చేసినట్లుగా ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి కొంత మ్యూజిక్ అచ్చు గుద్దినట్లు ఉండడంతో ట్రోల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

    విడుదలైన కొన్ని గంటలకే వైరల్

    విడుదలైన కొన్ని గంటలకే వైరల్

    ఈ కాలంలో సోషల్ మీడియా అనేది మనిషి ఊహలకు ఏ మాత్రం అందడం లేదు. సమాచారం అనేది సెకన్లలో అందుతోంది. థమన్ కాపీ సాంగ్ కూడా మరోసారి అదే రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇలాంటి కాపీ ఆరోపణలు థమన్ కు కొత్తేమి కాదు. మొన్న వచ్చిన బెస్ట్ ఆల్బమ్ అల.. వైకుంఠపురములో కూడా కొన్ని సాంగ్స్ కాపీ అంటూ ట్రోలింగ్ నడిపించారు. మరి ఈ ట్రోలింగ్స్ పై థమన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

    English summary
    Music Director Devi Sri Prasad has been a music director for the past 20 years in the South Cinema Industry. Devi, who has set a new trend with her songs at an early age. He worked with almost all of the star heroes in Tollywood. Devi Style differentiates the music from the short film without making a big difference. Otherwise some rumors of this rock star wedding are now going viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X