వైసీపీ నేతలకు ట్విస్ట్ ఇచ్చిన నిర్మాతలు.. పవన్ కళ్యాణ్ తో ధైర్యంగా మరోసారి చర్చలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఊహించని వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు సరైన క్రమంలో న్యాయం జరగడం లేదని అనేక రకాల సమస్యలు ఉన్నాయని వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపణలు బాగానే బస్తున్నాయి. ఇక ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో అధికార ఆంధ్రప్రదేశ్ పార్టీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసిన అనంతరం ఇండస్ట్రీ నుంచి అయితే పెద్దగా మద్దతు లబించలేదు.

కానీ ఒక విధంగా పవన్ కళ్యాణ్ మాటలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా అధికారిక ప్రకటన విడుదల చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఇటీవల వైసీపీ నాయకులను కలుసుకున్న నిర్మాతలలు ఎవరూ ఊహించని విధంగా వెంటనే జనసేన అధినేతను మళ్ళీ కలవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

సినిమా ఈవెంట్ లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

సినిమా ఈవెంట్ లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం థియేటర్స్ టికెట్ల రేట్లు వంటి ఇతర సమస్యలు చాలానే ఉన్నాయి. అయితే ఆ సమస్యలపై గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్ నిర్మాతలు హీరోలు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇక ఆ సమస్యలపై నాయకులు పట్టించుకోవడం కూడా లేదని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి ఎలాంటి మద్దతు లభించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది.

పవన్ కళ్యాణ్ అసంతృప్తి

పవన్ కళ్యాణ్ అసంతృప్తి

ఒక విధంగా పవన్ కళ్యాణ్ అయితే నిర్మాతలు కొందరు సినీ ప్రముఖులు ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం వల్లనే ఆ విధంగా రిపబ్లిక్ రిలీజ్ ఈవెంట్ లో అధికార నాయకులను ప్రకటించాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఇటీవల పార్టీ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు కానీ తమతో చెప్పుకొని మళ్లీ ఆ తర్వాత మరొక విధంగా స్పందించడం ఏమాత్రం నచ్చలేదని కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాట్లాడాడు.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్..

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్..

అంతేకాకుండా ఇక నుంచి ఆ విషయాలపై కూడా తాను ఇండస్ట్రీలోని విషయాలను పెద్దగా పట్టించుకోనని పట్టించుకోవాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా వైసీపీ నేతలను అలా ప్రశ్నించడానికి నాకేమైనా సరదా నా అని కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడిన తర్వాతనే టాలీవుడ్ నిర్మాతల తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకులు చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారు ఒక విధంగా విమర్శలు చేసినప్పటికీ కూడా మళ్లీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని ఏపీ నాయకులు భరోసా ఇచ్చారు.

మళ్ళీ పవర్ స్టార్ తో చర్చలు..

మళ్ళీ పవర్ స్టార్ తో చర్చలు..

నేడు ఉదయం టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X