ఏపీ గవర్నమెంట్‌ను వదలవా 'బ్రో'... పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ వేశాడుగా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ ఫుల్ బిజి బిజిగా గడుపుతున్నారు. ఇక ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు జులై 28న విడుదలై.. సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక మెగా ఫ్యాన్స్ కు ఈ మూవీ పూనకాలు తెప్పిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఏపీ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్. ఆ వివరాల్లోకి వెళితే....
పాజిటివ్ టాక్ తో... :పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ బ్రో. ఈరోజు జులై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తోంది. ఇక తమిళ నటుడు,దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమా పీపూల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద తెరకెక్కింది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మతలుగా వ్యవహారించంగా.. జీ స్టూడియోస్ సమర్పిస్తోంది.

థియేటర్లలో సందడి... :తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్టుగా నిలిచిన వినోదయ సిత్తం సినిమాను... తెలుగు నెటివిటీగా తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేశారు. ఇక తమిళ ఒరిజినల్ మూవీ డైరెక్ట్ చేసిన సముద్రఖని.. తెలుగులోనూ ఆయన దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది.
పవర్ ఫుల్ డైలాగ్స్... :యూఎస్ఏ ప్రిమియర్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విధంగా సినిమా ఉంటుందని సాయి ధరమ్ తేజ్ చెప్పినట్లుగానే సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మధ్య సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ కూడా పెడుతున్నారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో.. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి డైలాగ్స్ ఉన్నాయని.. అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించారు. అయితే తాజాగా బ్రో సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఉందట.

ఏపీ గవర్నమెంటుకు పంచ్...:బ్రో మూవీలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కు బ్రో మూవీ బిగ్ ట్రీట్ అంటున్నారు. ఊహించిన విధంగానే త్రివిక్రమ్ పవన్ కోసం పొలిటికల్ డైలాగ్స్ రాశారు. ముఖ్యంగా గాజు గ్లాసు మీద రాసిన డైలాగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలివేట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని ప్రీమియర్ టాక్.

బ్రో టాక్...:మొత్తంగా బ్రో మూవీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్. పవన్ కల్యాణ్ మేనరిజం, టైమింగ్ డైలాగ్స్, డాన్సులు ఫీస్ట్ గా నిలిచాయి. ఇక పవన్ ఎనర్జీతో ఫస్ట్ హాఫ్ పూర్తి చేయగా... సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. పవన్ ఎంట్రీ సీన్ తో పాటు కొన్ని సన్నివేశాలను తన మ్యూజిక్ తో తమన్ ఎలివేట్ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఫ్యామిలీతో కలిసి బ్రో మూవీకి వెళ్లొచ్చు.


Click it and Unblock the Notifications











