పాపం అడుగడగునా టెన్షనే.. పుష్ప నుంచి కొత్త లీక్...రచ్చ లేపుతున్నారుగా!
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప సినిమా యూనిట్ కి మరో టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ముందు నుంచి ఏ విషయంలో అయితే టెన్షన్ పడుతున్నారో ఇప్పుడు మళ్లీ అదే టెన్షన్ మొదలైంది..అదే లీకేజీ టెన్షన్..ఇప్పటికే సినిమా నుంచి అనేక లీకులు బయటకు రాగా సినిమా నిర్మాణ సంస్థ కూడా సీరియస్ అయింది. ఈ లీకేజీ ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తామని చెబుతున్నా లీకేజ్ రాయుళ్లు టెన్షన్ పడడం లేదు. తాజాగా లీకైన విషయానికి వస్తే

భారీ అంచనాలు
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రష్మీక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏ ముహూర్తాన సెట్స్ పైకి వెళ్లిందో కాని ఆ సినిమాకి అడుగడగున అడ్డంకాలే ఎదురువుతున్నాయి. కరోనా వలన షూటింగ్‌కి అంతరాయం వాయిదాలు, ఆ తరువాత డెంగీ వలన వాయిదా, సినిమా లీకేజులు, హిందీ భాషలో విడుదల చేయడానికి పలు సమస్యలు ఏర్పడడంతో యూనిట్ దినదినగండంగా పుష్ప టీమ్ గడుపుతోంది.

మొన్న యూనిట్ అధికారికంగా ప్రకటించగా
మైత్రీ మూవీ మేకర్స్ ముట్టంశెట్టి మీడియా వర్క్స్ బ్యానర్ లో సంయుక్తంగా రూపొందుతున్న 'పుష్ప' సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ షూటింగ్ వీడియో లీక్ అయింది. నిజానికి షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో ప్రస్తుతం ఓ మాస్ డ్యాన్స్ నంబర్ షూటింగ్ చేస్తున్నారు ఉంది. 'పుష్ప: ది రైజ్' లోని ఈ పాట చిత్రీకరణలో 1000 మంది డాన్సర్స్ పాల్గొంటున్నట్లు ఈ మధ్యనే మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఆ నెంబర్లను అల్లు అర్జున్ ను ఊచించుకుంటేనే గూజ్ బాంప్స్ వస్తాయని భావించారు కానీ అనూహ్యంగా అదే షూట్ నుంచి వీడియోలు లీకైనట్లు తెలుస్తోంది.

మరో వీడియో లీక్
షూటింగ్ స్పాట్ నుండి బన్నీ డ్యాన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు ఆన్ లైన్ లో లీక్ చేశారు. దీనిని ఓ నెటిజన్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. "వెయిటింగ్ పుష్ప మావా.. హే బిడ్డా ఇది నా అడ్డా" అని ట్వీట్ చేశారు. ఈ దెబ్బతో అల్లు అర్జున్ మాస్ స్టెప్పులతో కూడిన ఈ షూట్ క్లిప్పింగ్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ముందు నుంచి అదే టెన్షన్
నిజానికి పుష్పకు మొదటి నుంచీ ఈ లీకుల బెడద టెన్షన్ పెడుతూనే ఉంది. 'దాక్కో దాక్కో మేక' సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వెర్షన్ తో పాటుగా ఓ ఫైట్ సీన్ మరియు కాకినాడ పోర్టులో షూటింగ్ కు సంబంధించిన ఫుటేజ్ ఆ మధ్య బయటకు రాగా సినిమా నిర్మాణ సంస్ధ సీరియస్ అయింది కూడా. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు.
Recommended Video

పోలీసులకు ఫిర్యాదు చేసినా నో యూజ్
మైత్రి టీం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసి కూడా చాలా కాలం అయింది కానీ ఇంకా లీకుల టెన్షన్ కొనసాగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనీ చెప్పక తప్పదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమాని రెండు భాగాలుగా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని "పుష్ప: ది రైజ్" పేరుతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇందులో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











