సాహో నుంచి మరో సర్‌ప్రైజ్.. సినిమా రేంజ్ తెలిపేలా గేమ్ ట్రైలర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ 'సాహో'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తి పెంచేలా సరికొత్త వీడియోలను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. గతంలో షేడ్స్ ఆఫ్ సాహో పేరిట పలు వీడియోలు రూపొందించి సాహూలో యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉండనుందో తెలిపే ప్రయత్నం చేసింది చిత్రయూనిట్. ఆ తర్వాత చిత్రంలోని క్యారెక్టర్స్ ఒక్కక్కరి లుక్ రివీల్ చేస్తూ ఆసక్తి రేకెత్తించింది.
ఇక ఇటీవలే సాహో ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిన యూనిట్ సభ్యులు.. తాజాగా గేమ్ ట్రైలర్ రూపంలో మరో మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఒక నిమిషం 8 సెకనుల నిడివితో కూడిన ఈ వీడియోలో సాహోలో యాక్షన్ సీన్స్ రేంజ్ ఎలా ఉంటుందో తెలిపే ప్రయత్నం చేశారు. సాహో టీమ్ వదిలిన ఈ డిఫెరెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి సాహో సినిమా తెరకెక్కించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సీన్స్ చూడొచ్చని అంటోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











