నిజంగానే ‘సరిలేరు’ అనిపించేలా.. బుకింగ్స్‌లోనూ ట్రెండ్
మహేష్ బాబు సినిమా వస్తోందంటే.. కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌లోనే కాదు సగటు సినీ అభిమానిలోనూ ఉత్కంఠ రేగుతుంది. క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మహేష్ బాబు.. వరుస హిట్లతో బాక్సాఫీస్ పని పడుతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్లతో ఇప్పటికే రికార్డులను తన పేరు మీదే రాసుకున్న మహేష్.. మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాడు.

కేవలం ఐదు నెలల్లోనే..
ఎఫ్2 లాంటి భారీ హిట్ కొట్టిన మీడియం రేంజ్ దర్శకుడికి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చాన్స్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మహేష్ బాబు సినిమాలంటే.. ఆలస్యమవుతాయని అందరూ అనుకుంటారు. కానీ ఈ చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు దర్శకుడు.

ఎన్నో ప్రత్యేకతలతో..
సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ పెట్టడం దగ్గరి నుంచి ఎన్నో ప్రత్యేకతలను జొప్పించిన ఈ చిత్ర యూనిట్.. సరిలేరును భారీ ఎత్తున నిర్మిచింది. విజయశాంతి, బండ్ల గణేష్ లాంటి వారిని ప్రత్యేక పాత్రల్లో తీసుకుని సినిమాపై హైప్‌ను పెంచేసింది. విజయశాంతిని ఈ చిత్రంలో నటించేలా ఒప్పించడం, ఆమె కోసమే ప్రత్యేకంగా ఓ పాత్రను రాసుకోవడం అందరికీ ఆసక్తిని రేకెత్తిచింది.

అంచనాలు పెంచేసిన టీజర్, ట్రైలర్..
అప్పటి వరకు పోస్టర్లతోనే హైప్ క్రియేట్ చేసిన సరిలేరు టీమ్.. టీజర్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. టీజరే ఈ రేంజ్‌లో ఉంటే ట్రైలర్ ఇంకేస్థాయిలో ఉంటుందా? అని అందరూ అనుకున్నారు. అదే నిజం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్.. సోషల్ మీడియాను షేక్ చేసింది. ట్రైలర్‌తో సరిలేరుపై పదింతలు అంచనాలు పెంచేసింది.
Recommended Video

రిలీజ్‌కు సిద్దం.. బుకింగ్స్‌లో ట్రెండ్
జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం.. బుకింగ్స్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో సరిలేరు చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఓ రేంజ్‌లో తెగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్‌కు ఎక్కువ పట్టున్న నైజాంలో ఓ రేంజ్‌లో బుకింగ్ జరుగుతుండగా.. ఆంద్ర, సీడెడ్‌లో అన్ని స్క్రీన్స్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











