మరో రా & రస్టిక్ లవ్ స్టోరీ లోడింగ్.. ప్రేమిస్తే వేలాడతీయడమే.. ఆసక్తిరేపుతున్న ఊరికి ఉత్తరాన టీజర్!

ఈ మధ్య కాలంలో తెలుగు భాషలో అనేక విభిన్నమైన సినిమాలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా భిన్నంగా ఉన్న సినిమాలను ఆదరిస్తున్న కారణంగా దాదాపు అందరూ భిన్నమైన సినిమాలు చేయడానికి చూస్తున్నారు. అటువంటి సినిమానే "ఊరికి ఉత్తరాన". ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న 'ఊరికి ఉత్తరాన' సినిమాతో కోన వెంక‌ట్‌, వేణు శ్రీ‌రామ్‌ల వ‌ద్ద దర్శకత్వ శాఖలో ప‌నిచేసిన స‌తీష్ ప‌రమ‌వేద దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ సినిమాలో నరేన్ హీరో‌గా ప‌రిచ‌యం అవుతుండ‌గా, దీపాలి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. రామరాజు, 'మల్లేశం' ఫేమ్ ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ''గాలి వచ్చిన సంగతి చెట్టు ఆకు చెప్తాది.. వన వచ్చిన సంగతి మట్టి వాసన చెప్తది.. కానీ ప్రేమ విలువ కన్నవాళ్ళు చచ్చాక తెలుస్తది.. అంటూ మొదలయ్యే ఈ టీజర్ వారం రోజులు గడువు ఇస్తాను లేదంటే ఊరికి ఉత్తరాన ఉన్న వుట్టికి వేలాడదీస్తా.. అంటూ ఒక మనిషిని ఉట్టికి వేలాడ దీశాక టీజర్ ముగుస్తుంది.

 Ooriki Utharaana Movie Teaser Talk

భీమ్స్ - సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన ఒక య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు పూర్తయ్యాయి. త్వరలో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. "ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.. కానీ ప్రేమిస్తే మ‌ర‌ణ‌మే..!" అనే క్యాప్షన్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నేది తెలియ‌జేస్తోంది. రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X