Ooru Peru Bhairavakona Twitter Review వీఐ ఆనంద్ క్రియేట్ చేసిన డిఫరెంట్ వరల్డ్.. ఊరు పేరు భైరవకోన ఎలా ఉందంటే?
యువ హీరో, హీరోయిన్లు సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర, రాజేశ్ దండ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ మీ కోసం..
ఊరు పేరు భైరవకోన చిత్రం ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ డీసెంట్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్. మ్యూజిక్, విజువల్స్ సినిమాకు బలంగా మారాయి. వెన్నెల కిషోర్, హర్ష కామెడీ బాగుంది. సినిమాటోగ్రఫి ఎక్సలెంట్‌గా ఉంది. దర్శకుడు వీఐ ఆనంద్, నిర్మాత అనిల్ సుంకర, సందీప్ కిషన్, టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఊరు పేరు భైరవకోన సినిమా డీసెంట్ ఫాంటసీ థ్రిల్లర్. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. హర్ష చెముడు కామెడీ టైమింగ్ బాగుంది. వీఐ ఆనంద్ టెక్నికల్ వర్క్ బ్రహ్మండంగా ఉంది. బీజీఎం, యాక్షన్ బాగున్నాయి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఊరు పేరు భైరవకోన సినిమా అర్ధాంతరంగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే ముగించారనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. థ్రిల్స్, ట్విస్టులు ఏమీ లేవు. సినిమాకు బలంగా మారే లవ్ స్టోరి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కామెడీ లేదు, హారర్ లేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దర్శకుడు వీఐ ఆనంద్ మంచి ప్రాజెక్టుతో వచ్చారు. కానీ సినిమాలో కొన్ని ప్లస్, మైనస్‌లు ఉన్నాయి. ఫస్టాఫ్‌లో నేరేషన్ చాలా కన్‌ఫ్యూజన్ ఉంి. అయితే అలాంటి సందేహాలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇచ్చి బాగా కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్ బెటర్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓసారి చూడొచ్చు అని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు.
ఊరు పేరు భైరవకోన డీసెంట్ ఫాంటసీ థ్రిల్లర్‌గా మలిచారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో వీఐ ఆనంద్ సినిమాను రూపొందించారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఊరు పేరు భైరవకోన సినిమా ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా స్టార్ట్ అయింది. కామెడీ, స్క్రీన్ ప్లే, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్ కనెక్ట్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











