Payal Ghosh: ఆ డైరెక్టర్ నన్ను రేప్ చేశాడు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ అది.. ఊసరవెల్లి బ్యూటి షాకింగ్ గా!
సుమారు ఐదారు ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. గతేడాది దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఈ సినిమాలో తారక్ నటన, పండించిన ఎమోషన్స్ కు యావత్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక RRRలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు తారక్. అయితే ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ నటించిన ముద్దుగుమ్మ పాయల్ ఘోష్ తనపై ఓ డైరెక్టర్ లైంగిక దాడి చేశాడని చెప్పుకొచ్చింది.

దర్శకుడిగా జక్కన్న పరిచయం..
సినీ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబంలో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ తనదైన నటన, ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. 2001లో హీరోగా తెరంగేట్రం చేసిన తారక్ మళ్లీ అదే సంవత్సరం చేసిన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతోనే రాజమౌళి సినీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

గ్లోబల్ స్టార్ గా ఎదిగి..
స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమైన రాజమౌళి, తారక్ ఫ్రెండ్ షిప్ నేటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి, యమదొంగ సూపర్ హిట్స్ కొట్టాయి. అలా స్టార్ట్ అయన వీరిద్దరి ప్రయాణం నేడు RRR వరకు చేరింది. ఈ చిత్రంలో కొమురం భీమ్ గా నటించి తన నటనకౌశల్యాన్ని యావత్ ప్రపంచానికి రుచి చూపించాడు ఎన్టీఆర్. ఈ చిత్రంతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు తారక్.

మంచు మనజో మూవీతో..
ఇదిలా ఉంటే బెంగాలీ ముద్దుగుమ్మ పాయల్ ఘోష్ గురించి తెలుగు వారికి పరిచయం ఉండే ఉంటుంది. ఎందుకంటే పాయల్ తెలుగులో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే బీబీసీ తెరకెక్కించిన ఓ ఇంగ్లీష్ మూవీ ద్వారా పరిచయం అయింది పాయల్ ఘోష్. ఆ తర్వాత ఏడాదిలో మంచు మనోజ్ సరసన జత కట్టి ప్రయాణం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అనంతరం కన్నడ సినిమాలో నటించిన ఆమెకు పెద్దగా సక్సెస్ వరించలేదు.
తమన్నాకు ఫ్రెండ్ గా..
2011లో సురేందర్ రెడ్డి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఊసరవెల్లి సినిమాలో ఓ పాత్ర చేసింది గ్లామరస్ బ్యూటి పాయల్ ఘోష్. ఇందులో మిల్కీ భామ తమన్నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి అలరించింది. అనంతరం మిస్టర్ రాస్కెల్ సినిమాలో నటించిన ఆమెకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. తర్వాత 2017లో హిందీలోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా పెద్దగా వర్కౌట్ కాకపోయేసరికి ప్రస్తుతం సినిమాలు ఏవి చేయట్లేదు.
ఇద్దరు డైరెక్టర్లతో..
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని పాయల్ ఘోష్ కేసు పెట్టినప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఏదో ఒక విధమైన కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతోంది ఈ భామ. తాజాగా పెట్టిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. "నేను సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ తో పనిచేశాను. కానీ ఏ ఒక్కరూ కూడా నన్ను అసభ్యంగా తాకలేదు. కానీ బాలీవుడ్ లో నేను అనురాగ్ కశ్యప్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ అతను మూడో మీటింగ్ లోనే నన్ను రేప్ చేశాడు. ఇప్పుడు చెప్పండి నేను ఎందుకు సౌత్ ఇండస్ట్రీని ప్రశంసించకూడదు" అని రాసుకొచ్చింది.

నేను తప్పుగా చెప్పలేదు..
మరొక ట్వీట్ లో "నేను సూపర్ స్టార్ ఎన్టీఆర్ తో కూడా పనిచేశాను. అతను కూడా అసభ్యంగా ప్రవర్తించలేదు. తారక్ ఒక జెంటిల్మెన్. అందుకే నాకు ఎప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. తారక్ గ్లోబల్ స్టార్ అవుతాడని నేను 2020లోనే చెప్పాను. నేను ఎప్పుడు తప్పుగాచెప్పలేదు" అని ముద్దుగుమ్మ పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కేందర్ మంత్రి రామ దాస్ అథవాలేకి చెందిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఆ పార్టీ ఉమెన్ వింగ్ కు వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయింది.


Click it and Unblock the Notifications











