ఆపరేషన్ గోల్డ్ పిష్ : ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయిు కుమార్
ఆది సాయికుమార్ హీరోగా సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో ఆది అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగా కనిపించబోతున్నారు.
వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్. టెక్నీషియన్స్ నిర్మాణ భాగస్వాములుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తవ్వడంతో గుమ్మడికాయ కొట్టేశారు.

ఆది సరసన శషా చెట్రి హీరోయిన్‌గా నటించగా... కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారుల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సాయికిరణ్ అడివి మాట్లాడుతూ సినిమాలో అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగానటిస్తోన్న ఆది సాయికుమార్‌కు ఆదివారం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది వరకు విడుదల చేసిన ఆయన లుక్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తున్నాం. నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ ఇది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.
బ్యానర్: వినాయకుడు టాకీస్
కాస్ట్యూమ్ డిజైనర్: కీర్తి
ఫైట్స్: రామకృష్ణ, సుబ్బు-నభా
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల
స్క్రిప్ట్ డిజైన్: అబ్బూరి రవి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ
కో ప్రొడ్యూసర్: దామోదర్ యాదవ్(వైజాగ్)
దర్శకత్వం: సాయికిరణ్ అడివి


Click it and Unblock the Notifications











