Operation Raavan First Thrill Review థ్రిల్లింగ్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఆపరేషన్ రావణ్
పలాస చిత్రంతో నటుడిగా నిరూపించుకొన్న రక్షిత్ అట్లూరి నటించిన తాజా చిత్రం ఆపరేషన్ రావణ్. ధ్యాన్ అట్లూరి నిర్మాతగా వెంకట సత్య రచయితగా, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రం విడుదలకు సిద్దమైంది. రాధిక శరత్ కుమార్, రఘు కుంచె తదితరులు నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వీడియోను ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ వేడుకకు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మారుతి, దర్శకుడు కల్యాణ్ కృష్ణ, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ ఫస్ట్ థ్రిల్ వీడియో వివరాల్లోకి వెళితే..
ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వీడియో మంచి ఫీల్‌ను, థ్రిల్లింగ్‌ను అందించింది. ఈ సినిమా టీజర్‌లో ఇంటెన్స్ మూమెంట్స్ కనిపించాయి. దైవభక్తి, దుష్టశక్తికి జరిగే పోరాటం మాదిరి ఫీల్‌ను కల్పించాయి. ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వీడియోలో హీరో రక్షిత్ అట్లూరి ఎమోషన్స్, లుక్ ఆకట్టుకొన్నది. మిస్టరీ మ్యాన్ విలన్‌గా రకరకాల రూపాలతో దశావతారం ఆకట్టుకొన్నది. రాధిక శరత్ కుమార్ ఒక సీన్‌లో ఇచ్చిన ఇంటెన్స్ లుక్ సినిమాలోని భావోద్వేగాలను చెప్పకనే చెప్పాయి.

ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వీడియో చూస్తే.. హై ఎమోషన్స్, రా, రగ్గడ్ హీరో, కొత్త రకంగా కథ, కథనాలు, గెటప్స్ ఆకట్టుకొనే రేంజ్‌లో ఉన్నాయి. ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచాయని చెప్పవచ్చు. రక్షిత్, వెంకటసాయి కాంబినేషన్ హిట్‌గా మారడం ఖాయమనే ఫీలింగ్ కలిగించింది. రాధిక శరత్ కుమార్ యాక్టింగ్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాజిటివ్ అంశాలుగా కనిపించాయి.

ఈ చిత్రం సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..
నటీనటులు: రక్షిత్ అట్లూరి, రాధిక శరత్ కుమార్, రఘు కుంచె తదితరులు
దర్శకత్వం: వెంకట సత్య
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
సినిమాటోగ్రఫి: నాని చమిడిశెట్టి
ఎడిటర్: సత్య గిదుటూరి
డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి
సాహిత్యం: వెంకట సత్య, ప్రణవం, పూర్ణాచారి
ఫైట్స్: స్టంట్స్ జాషువా
ఆర్ట్: టీ నాని
పీఆర్వో: జీఎస్కే మీడియా


Click it and Unblock the Notifications











