వరుణ్ తేజ్ మూవీకి ఊహించని టైటిల్: యుద్ధంలో ‘వాలంటైన్’ ఏంటి గురూ!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదటి నుంచీ వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్న అతడు.. ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అతడి గత చిత్రం 'గని' మాత్రం ఆశించిన రీతిలో ఆడలేదు. అయినప్పటికీ వరుణ్ తేజ్ ఫుల్ జోష్‌తోనే ముందుకు సాగిపోతున్నాడు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో 'గాండీవధారి అర్జున' అనే క్రేజీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ఇది ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే వరుణ్ తేజ్ తన 13వ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందిస్తున్నాడు. ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.

వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ రూపొందిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టు భారతదేశానికి చెందిన ఓ ఆర్మీ ఆఫీసర్ కథతో రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రానికి పిరియాడిక్ లేదా పవర్‌ఫుల్ టైటిల్‌ను పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్ లీక్ అయింది. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా 'ఆపరేషన్ వాలంటైన్' అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్- శక్తి ప్రతాప్ సింగ్ హడా కలయికలో రాబోతున్న ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించబోతున్నారు. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











