Operation Valentine Twitter Review వరుణ్ తేజ్ హిట్టు కొట్టాడా? ప్రీమియర్స్ తర్వాత టాక్ ఏంటీ?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ భామ మనుషీ చిల్లర్ జంటగా నటించిన భారత సైన్యంలో వైమానిక దళం నేపథ్యంగా పుల్వామా దాడి బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సందీప్ మడ్డా నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాపై నెటిజన్ల అభిప్రాయల వివరాల్లోకి వెళితే..

ఆపరేషన్ వాలైంటెన్ సినిమా చూశాను. ఇలాంటి సినిమాను తీసినందుకు మూవీ టీమ్‌ను అభినందనలు. గ్రేట్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ ఎక్సలెంట్‌గా ఉంది. వజ్రం లాంటి సినిమాను అందించిన వరుణ్ తేజ్‌కు కంగ్రాట్స్. సినిమా యూనిట్‌కు బిగ్ కంగ్రాట్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ సెకండాఫ్ బాగుంది. ఆకాశ వీధిలో యుద్ద విమాన దాడులు హాలీవుడ్ సినిమాను రేంజ్‌లో ఉన్నాయి. రుద్రగా వరుణ్ తేజ్ అదరగొట్టాడు. రుద్రగా ఆయన యాటిట్యూడ్ బాగుంది. దేశభక్తి, ఎమోషన్స్ కలగలిపిన చిత్రం. వందేమాతరం సాంగ్, బీజీఎం గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించాడు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమా ఒక ఎమోషనల్ జాయ్ రైడ్. ఎంగేజింగ్‌గా ఉంది. గొప్ప దేశభక్తి ప్రధానంగా సాగే సినిమా. నో నాన్సెన్స్ మూవీ. వరుణ్ యాక్టింగ్, బీజీఎం, ఎమోషనల్ సీన్లు ఈ సినిమాకు హైలెట్. మస్ట్ వాచ్ సినిమా అని నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్‌కు హ్యాట్సాఫ్. రుద్ర పాత్రలో అదరగొట్టాడు. సెకండాఫ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. యుద్ద సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్. బిగ్ స్క్రీన్‌లో ఆ ఎక్స్‌పీరియెన్స్ వేరే లెవెల్ ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా నాకు బాగా నచ్చింది. సూపర్‌గా ఉంది. వరుణ్, ఇతర పాత్రలకు ఎంపిక చేసిన నటుల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. స్టోరీని డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. పుల్వామా ఎటాక్ గురించి ఈ రేంజ్‌లో ఎవరూ చూపించరనే ఫీలింగ్ కలిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నా జోహార్లు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం నాకు బాగా నచ్చింది. వింగ్ కమాండర్‌గా వరుణ్ తేజ్ బాగా చేశాడు. పుల్వామా ఎటాక్ సీన్ గుండెను పిండేసేలా ఉంది. ఆ సీన్ చూసిన తర్వాత కంటతడి పెట్టుకొన్నాను. కథను డీవియేట్ కాకుండా చక్కగా ప్రజెంట్ చేశాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
వరుణ్ తేజ్ బాబుకు హ్యాట్సాఫ్. నీ సబెక్ట్ సెలక్షన్ అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమా డీసెంట్‌గా మొదలై ఇంప్రెసివ్‌గా సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదరగొట్టేలా ఉంది. దేశభక్తి ప్రధానంగా సాగుతూ ఫీల్‌గుడ్‌గా ఉంది. సీజీ వర్క్, ఆర్ఆర్, సినిమాటోగ్రఫి ఎక్సలెంట్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











