Most Popular heros: నెంబర్ వన్ స్థానంలో తమిళ్ హీరో.. టాప్ లిస్టులో ఈసారి బాలీవుడ్ స్టార్స్ ఇద్దరే!

ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలలోని హీరోలు కూడా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇప్పుడు కంటెంట్ పరంగా ఎవరు ఎక్కువ స్థాయిలో ఆకట్టుకుంటే వారికే మంచి గుర్తింపు వస్తోంది. ఇక ఓరామాక్స్ సంస్థ నిర్వహించే సర్వేలలో ప్రతిసారి కూడా సౌత్ హీరోలు డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. డిసెంబర్ 2022లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్టులో మన సినీ తారలకు మంచి గుర్తింపు లభించింది. ఆ లిస్టులో కేవలం ఇద్దరు బాలీవుడ్ హీరోలు మాత్రమే నిలవడం విశేషం. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..

టాప్ లో విజయ్, ప్రభాస్

టాప్ లో విజయ్, ప్రభాస్

ఈసారి మోస్ట్ పాపులర్ హీరోలలో విజయ్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. అతను గతంలో ఇండియా మొత్తంలో అయితే టాప్ ఫైవ్ 5 లిస్టు తర్వాతనే కనిపించాడు. కానీ ఈసారి మాత్రం వారసుడు సినిమాతో బాగా పాపులర్ అయిన విజయ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంకా అతని తర్వాత ప్రభాస్ రెండవ స్థానంలో నిలవడం విశేషం. ప్రభాస్ ఆదిపురుష్ రాకపోయినప్పటికీ కూడా డిసెంబర్లో అన్ స్టాపబుల్ ద్వారా బాగా క్రేజ్ అందుకున్నాడు.

 జూనియర్ ఎన్టీఆర్, అక్షయ్ కుమార్

జూనియర్ ఎన్టీఆర్, అక్షయ్ కుమార్

RRR సినిమా ద్వారా బాగా క్రేజ్ అందుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ఈ సర్వేలో మూడవ ర్యాంకు సంపాదించడం విశేషం. దేశవ్యాప్తంగా అతనికి కూడా ఇప్పుడు మంచి క్రేజ్ అయితే అందుతుంది. ఇక బాలీవుడ్ హీరోల నుంచి అక్షయ్ కుమార్ ఈ లిస్టులో 4వ స్థానం సంపాదించుకోవడం విశేషం. ఒక విధంగా అతను గ్యాప్ లేకుండా సినిమాలు వదులుతూ ఉండడంతో జనాల్లో కొంత హాట్ టాపిక్ గా అయితే మారుతున్నాడు.

 అల్లు అర్జున్, యష్

అల్లు అర్జున్, యష్

గతంలో అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తూ వచ్చాడు. అయితే ఈ మధ్య పుష్ప సినిమాకు సంబంధించిన హడావిడి ఏమి అందంగా కనిపించలేదు. దీంతో అల్లు అర్జున్ ఈసారి ఐదవ ర్యాంక్ అందుకున్నాడు. ఇక అతని తర్వాత 6వ స్థానంలో కన్నడ హీరో యష్ నిలిచాడు. అతని తదుపరి సినిమాకు సంబంధించిన గాసిప్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఈసారి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాడు అందుకున్న వారు స్థానంలో గెలిచాడు

అజిత్, షారుక్ ఖాన్

అజిత్, షారుక్ ఖాన్

ఇక తమిళ్ హీరో అజిత్ రేంజ్ కూడా మెల్లమెల్లగా పెరుగుతుంది. అసలు అతను సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలకు చాలా దూరంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా అతను ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాడు. ఎక్కువగా అతని లుక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక అతను ఈ సర్వేలో 7వ ర్యాంక్ అందుకున్నాడు. ఇక అతని తర్వాత బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ 8వ స్థానంలో నిలవడం విశేషం. పఠాన్ సినిమాకు సంబంధించిన కాంట్రవర్సీలు ఈ మధ్య భాగం వైరల్ అయిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్, మహేష్ బాబు

రామ్ చరణ్, మహేష్ బాబు

ఇక టాప్ టెన్ లిస్టులో చివరి రెండు స్థానంలో తెలుగు హీరోలే నిలిచారు 9వ స్థానంలో రామ్ చరణ్ తేజ్ ఉండగా పదవ స్థానంలో మహేష్ బాబు నిలిచాడు. రామ్ చరణ్ తేజ్ కూడా ఎక్కువగా RRR సినిమాకు సంబంధించిన విశేషాలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. ఇక అతని తర్వాత పదవ స్థానంలో నిలిచిన మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన గాసిప్స్ తో కూడా ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X