Most Popular Stars: ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా అతనే నెంబర్ వన్.. టాప్ లిస్టులో వెంకీ కూడా..
ఇంటర్నెట్ ప్రపంచంలో ఇటీవల కాలంలో స్టార్ హీరోల క్రేజ్ మార్కెట్ పై కూడా ప్రభావం గట్టిగానే చూపిస్తోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా స్టార్స్ సోషల్ మీడియా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక శాటిలైట్ డిజిటల్ సోషల్ మీడియా ఆధారంగా బాగా క్రేజ్ అందుకున్న స్టార్స్ పై సర్వేలు నిర్వహించే ఓరామాక్స్ అక్టోబర్ నెల సర్వే లిస్ట్ కూడా విడుదల చేసింది. ఇక ఆ సర్వే ఆధారంగా మన టాలీవుడ్ టాప్ 10 స్టార్ హీరోల లిస్ట్ పై ఒక లుక్కేస్తే...

ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్
ఈసారి టాప్ నెంబర్ వన్ లో ప్రభాస్ నిలిచాడు. ఓరామాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లో గత కొంతకాలంగా ప్రభాస్ 5వ స్థానం తర్వాతనే ర్యాంక్ అందుకుంటున్నాడు. అయితే ఈసారి మాత్రం ఆదిపురుష్ కారణంగా అతని మీద ట్రోలింగ్ వచ్చినప్పటికీ ప్రభాస్ మళ్ళీ ట్రేండింగ్ లిస్ట్ లో కొనసాగారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్టుతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచి 2వ స్థానం అందుకున్నాడు.

అల్లు అర్జున్ - మహేష్ బాబు
అల్లు అర్జున్ గత రెండు మూడు నెలల నుంచి టాప్ లిస్టులోనే కొనసాగుతున్నాడు. అయితే ఈసారి అతను మూడో స్థానానికి పడిపోయాడు. ఎక్కువగా పుష్ప సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తోనే అల్లు అర్జున్ పేరు మీడియాలో హాట్ ఆఫ్ మారింది. ఇక మహేష్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా మహేష్ బాబు పేరును 4వ స్థానంలో వైరల్ అయ్యేలా చేశాయి.

రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మోస్ట్ పాపులర్ సర్వేలో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా సినిమాకు సంబంధించిన హడావిడి మరోసారి సోషల్ మీడియాలో కనిపించింది. దీంతో అతను ఈ సర్వేలో 5వ స్థానంలో నిలిచాడు. ఇక 6వ ర్యాంక్ ను ఈసారి పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఈ సర్వేలో టాప్ 10 లిస్టులో కొనసాగుతున్నడు.

నాని - విజయ్ దేవరకొండ
నేచురల్ స్టార్ నాని అక్టోబర్ నెలలో కూడా కొన్ని సినిమాల అప్డేట్స్ తో బాగా హడావిడిగా నిలిచాడు. ముఖ్యంగా తన హిట్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక నిర్మాతగా అతను కొంత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో 6వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ ఈసారి ఏడవ స్థానంలో నిలిచాడు. అతని ఖుషి సినిమాకు సంబంధించిన బిజినెస్ వార్తలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

చిరంజీవి - వెంకటేష్
ఇటీవల కాలంలో సీనియర్ హీరోలు కూడా నేటితరం యువ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా సోషల్ మీడియాలో హడావిడిగానే కనిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అక్టోబర్ నెలలో కూడా పలు సినిమాల అప్డేట్స్ తో ట్రెండింగ్ లిస్టులో చేరారు. ఓరామాక్స్ సర్వేలో ఆయన తొమ్మిదవ స్థానంలో నిలిచారు. ఈ అక్టోబర్ నెలలో వెంకటేష్ పేరు కూడా బాగా వైరల్ అయింది. ఓ మై గాడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించిన వెంకీ కొంత సోషల్ మీడియాని ఎట్రాక్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు మోస్ట్ పాపులర్ సర్వేలో అతను 10వ స్థానంలో నిలిచాడు.


Click it and Unblock the Notifications











