Most Popular Stars: ఈసారి టాప్ లిస్టులో చేరిన నాని.. ఆ నలుగురి కంటే తక్కువలో మహేష్ ర్యాంక్!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇటీవల కాలంలో స్టార్ హీరోల క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక ఆమె మార్కెట్ పై కొంత ప్రభావం చూపిస్తోంది. అయితే ఏ సినిమా చేసినా కూడా సోషల్ మీడియా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో వైరల్ అయ్యే దాన్ని బట్టి సర్వేలు కొనసాగుతున్నాయి. శాటిలైట్ డిజిటల్ సోషల్ మీడియా ఆధారంగా బాగా క్రేజ్ అందుకున్న స్టార్స్ పై సర్వేలు నిర్వహించే ఓరామాక్స్ సంస్థ 2023 ఏప్రిల్ నెల సర్వే లిస్ట్ కూడా విడుదల చేసింది. ఇక ఆ సర్వే ఆధారంగా మన టాలీవుడ్ టాప్ 10 స్టార్ హీరోల లిస్టుపై ఒక లుక్కేస్తే...

ప్రభాస్ - రామ్ చరణ్: ఈ సర్వేలో ప్రభాస్ ఎప్పుడు కూడా టాప్ లిస్టులో పోటీ పడుతూనే ఉంటాడు. ఇక చాలాకాలంగా ఆదిపురుష్ కు సంబంధించిన అనేక రకాల విషయాలతో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇక రెండవ ర్యాంకు ఈసారి రామ్ చరణ్ దక్కించుకున్నాడు. గేమ్ చెంజర్ కు సంబంధించిన మూవీ గాసిప్స్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల వార్తలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. దీంతో రామ్ చరణ్ టాప్ లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు.

 Most Popular Stars

Jr ఎన్టీఆర్ - అల్లు అర్జున్: ఇక టాప్ 2 లిస్టు తర్వాత ఈసారి జూనియర్ ఎన్టీఆర్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో నెంబర్ వన్ లిస్టులో కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ కూడా గత నెలలో వైరల్ కాలేదు. దీంతో ఈ సర్వేలో అతనికి మూడవ ర్యాంకు దక్కింది. ఇక అల్లు అర్జున్ ఎప్పుడు కూడా పుష్పకు సంబంధించిన హడావిడితోనే కనిపిస్తూ ఉన్నాడు. ఈ సర్వేలో అతను నాలుగో ర్యాంకు సంపాదించుకున్నాడు.

 Most Popular Stars

మహేష్ బాబు - నాని: ఇక ఈ టాప్ లిస్టులో మహేష్ బాబు స్థానం ఐదుకి చేరుకోవడం విశేషం. గతంలో ఇంతకంటే హై లెవెల్ లో కొనసాగిన మహేష్ బాబు ఈసారి త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా పెద్దగా వదిలింది లేదు. దీంతో మహేష్ గత నెలలో ఎక్కువగా హైలెట్ కాలేదు. దీంతో అతని ర్యాంక్ 5కు చేరుకుంది. అయితే ఈ లిస్టులో నాని 6 స్థానంలో కొనసాగుతూ ఉండడం విశేషం. దసరా సినిమాతో బాగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న అతను గత నెలలో మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో కూడా బాగానే ట్రెండింగ్ లిస్టులో చేరాడు. దీంతో ఈసారి టాప్ 10 స్టార్ హీరోల లిస్టులో అతను ర్యాంక్ సాధించడం విశేషం.

 Most Popular Stars
పవన్ కళ్యాణ్ - చిరంజీవి: మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఆ తరువాత స్థానంలో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సినిమాలతో బాగానే వైరల్ అయ్యాడు. ఇక అతనికి ఏడవ ర్యాంకు రాగా ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన తదుపరి ప్రాజెక్టులపై ఈ మధ్యకాలంలో బాగా వార్తలు వచ్చాయి. ఇంకా మెగాస్టార్ వాటికి సంబంధించిన అప్డేట్స్ అధికారికంగా ఇస్తే మాత్రం ఆయన నెక్స్ట్ టాప్ లిస్టులోకి చేరుకోవడం పక్క అని చెప్పవచ్చు.
 Most Popular Stars

విజయ్ దేవరకొండ - రవితేజ:

ఇక చివరి రెండు స్థానాల్లో విజయ్ దేవరకొండ రవితేజ కొనసాగుతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖుషి సినిమాతోనే బాగా హైలైట్ అవుతూ ఉన్నాడు. సమంత ఈ సినిమాలో కథానాయకగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయ్ ఈసారి ఓరామ్యాక్స్ సర్వేలో 9వ స్థానంలో కొనసాగాడు. ఇక గత నెలలో రవితేజ డిజాస్టర్ ఎదుర్కొన్నప్పటికీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల అప్డేట్స్ బాగానే వైరల్ అయ్యాయి. దీంతో ఏప్రిల్ నెలలో ఓరామ్యాక్స్ సర్వేలో రవితేజ 10వ స్థానం దక్కించుకున్నాడు.

 Most Popular Stars

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X