Most Popular Stars: నెంబర్‌వన్‌గా ప్రభాస్.. RRR హీరోల ర్యాంకులు ఎంతంటే?
ఇంటర్నెట్ ప్రపంచంలో స్టార్ హీరోల క్రేజ్ కూడా మార్కెట్ పై కొంత ప్రభావం చూపిస్తోంది. ఇక ఏ సినిమా చేసినా కూడా సోషల్ మీడియా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్టార్స్ క్రేజ్ కూడా పెరుగుతోంది. అయితే శాటిలైట్ డిజిటల్ సోషల్ మీడియా ఆధారంగా బాగా క్రేజ్ అందుకున్న స్టార్స్ పై సర్వేలు నిర్వహించే ఓరామాక్స్ సంస్థ ఫిబ్రవరి నెల సర్వే లిస్ట్ కూడా విడుదల చేసింది. ఇక ఆ సర్వే ఆధారంగా మన టాలీవుడ్ టాప్ 10 స్టార్ హీరోల లిస్ట్ పై ఒక లుక్కేస్తే...

ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్
గత కొంతకాలంగా ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు లైన్ లో ఉండడంతో అతని రేంజ్ మామూలుగా పెరగడం లేదు. ఇక ఈసారి కూడా ప్రభాస్ ఓరామ్యాక్స్ టాప్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మరోసారి కొరటాల శివ ప్రాజెక్టుతో పాటు RRR ఆస్కార్ హడావుడితో బాగానే వైరల్ అయ్యాడు. దీంతో మరోసారి ఈ లిస్ట్ లో 2వ స్థానం అందుకున్నాడు.

రామ్ చరణ్ - అల్లు అర్జున్
రామ్ చరణ్ పేరు కూడా ఈసారి బాగా వైరల్ అయింది. ఆస్కార్ అవార్డు వేడుక కోసం ప్రత్యేకంగా రామ్ చరణ్ ప్రమోషన్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ తరుణంలో ఈ సర్వేలో అయితే రామ్ చరణ్ మూడవ స్థానంలో నిలిచాడు. ఇక అతని తర్వాత నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ చోటు సంపాదించుకున్నాడు. బన్నీ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మహేష్ బాబు - పవన్ కళ్యాణ్
ఇక గతంలో అయితే మహేష్ బాబు ఎక్కువగా రెండవ స్థానంలో అలాగే మూడవ స్థానంలో కనిపిస్తూ వచ్చాడు. కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు 5వ స్థానంలో చోటు సంపాదించుకున్నాడు. ఇక అతని తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో నిలిచాడు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఇతర సినిమాల అప్డేట్స్ తో ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అతను ఈసారి ఆరో స్థానంలో నిలిచాడు.

నాని - చిరంజీవి
ఈసారి నాని కూడా టాప్ టెన్ లిస్టులో చోటు సంపాదించుకోవడం విశేషం. అతను ఎక్కువగా దసరా సినిమాతోనే బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో నాని ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. దీంతో ఓరామాక్స్ లిస్టులో నాని 7వ ర్యాంక్ అందుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి 8వ స్థానంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఫిబ్రవరిలో బాగా వైరల్ అయ్యాయి.

రవితేజ - బాలకృష్ణ
ఇక మాస్ మహారాజా రవితేజ ధమాకా సిమిమతో ఇటీవల బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన రికార్డ్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా మాస్ రాజా ట్యాగ్ బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈసర్వేలో 9వ స్థానంలో నిలిచాడు. ఇక నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో మరో బిగ్ హిట్ అందుకోవడంతో బాలయ్య పేరు మారుమ్రోగింది. ఇక ఈ లిస్టులో బాలకృష్ణ 10వ ర్యాంక్ అందుకున్నారు.


Click it and Unblock the Notifications











