టాలీవుడ్ టాప్ 10 హీరోలు వీరే.. లిస్టులో అగ్ర హీరోలతో పోటీగా మాస్ రాజా.. పవన్, మహేష్ ర్యాంక్స్ ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా చాలామంది హీరోలు ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపుని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా తెలుగు హీరోలు అయితే ఈ మధ్యకాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ సక్సెస్ లను అందుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ అందుకుంటున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల అత్యధిక స్థాయిలో క్రేజ్ అందుకున్న వారి లిస్ట్ ను ఓరామ్యాక్స్ రిలీజ్ చేసింది. జనవరి నెలలో డిజిటల్ మీడియా శాటిలైట్ ఆధారంగా సర్వే చేసి ఎక్కువగా పాపులర్ అయిన టాప్ టెన్ హీరోల ర్యాంక్స్ ను విడుదల చేశారు. ఇక గత నెలలలో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకున్న హీరోల ర్యాంక్స్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్

ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్

మరోసారి ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచి తన క్రేజ్ ను నిరూపించుకున్నాడు. రాధే శ్యామ్ తర్వాత డిజాస్టర్ వచ్చినప్పటికీ కూడా ప్రభాస్ రేంజ్ అయితే అసలు తగ్గలేదు. ఏదో ఒక సినిమా గాసిప్స్ తో అప్డేట్ తో అయితే అతని పేరు వైరల్ గానే మారుతుంది. ఇక ఈ లిస్టులో ఎన్టీఆర్ రెండవ ర్యాంకు అందుకున్నాడు. ఇటీవల నాటు నాటు పాట ద్వారా అతనికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక టాప్ టెన్ లో మొదటి రెండు స్థానాల్లో ప్రభాస్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు.

రామ్ చరణ్, అల్లు అర్జున్

రామ్ చరణ్, అల్లు అర్జున్

జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా నాటు నాటు పాట ద్వారానే అంతర్జాతీయ లెవెల్లో అయితే మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆస్కార్ బరిలో నిలవడంతో ఇప్పుడు ఓరామ్యాక్స్ జనవరి సర్వేలో రామ్ చరణ్ మూడవ ర్యాంకు అందుకున్నాడు. ఇక అతని తర్వాత ఈసారి అల్లు అర్జున్ నాలుగవ స్థానంలో నిలిచాడు. పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన లుక్కు ద్వారా సోషల్ మీడియాలో బన్నీ ఎక్కువగా వైరల్ అయ్యాడు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే అతని లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు జనవరిలో మాత్రం అతను ఐదవ స్థానంలో నిలిచాడు. గతంలో టాప్ ప్లేస్ లో నిలిచిన పవన్ కళ్యాణ్ ర్యాంక్ ఈసారి మరి కొంత తగ్గింది. ఇక ఫైనల్ గా అతను మహేష్ బాబు తర్వాత ఆరవ స్థానంలో నిలవడం విశేషం.

చిరంజీవి, నాని

చిరంజీవి, నాని

ఇక మెగాస్టార్ చిరంజీవి గత రెండు మూడు నెలలుగా ఓరామ్యాక్స్ సర్వేలో మంచి ర్యాంకును అందుకుంటూ వస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అనుకోవడంతో ఇప్పుడు ఆయన జనవరిలో ఏడో స్థానంలో నిలిచాడు. ఇక నెచురల్ స్టార్ నాని దసరా అప్డేట్స్ ద్వారానే ఎక్కువగా వైరల్ అయ్యాడు. దీంతో అతని ర్యాంక్ 8 కి వచ్చింది. అతను కూడా ఈమధ్య తన స్థాయిని మెల్లమెల్లగా పెంచుకుంటున్నాడు.

రవితేజ, విజయ్ దేవరకొండ

రవితేజ, విజయ్ దేవరకొండ

ఇక టైర్ వన్ అగ్ర హీరోల తర్వాత టైర్ 2లో ఎక్కువకాలం నుంచి కొనసాగుతున్న మాస్ మహారాజ రవితేజ కూడా కొన్నిసార్లు అగ్ర హీరోల తరహాలో క్రేజ్ అందుకుంటూ వస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ సర్వేలో అతను 9వ స్థానంలో నిలిచాడు. ఇక చివరగా పదవ స్థానంలో విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడు. జనవరిలో అతనికి సంబంధించిన మూవీ అప్డేట్స్ అయితే పెద్దగా రాలేదు. అయినప్పటికీ కూడా అతను ఏదో ఒక లుక్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X