Most Popular Stars: ఇండియా మొత్తంలో తెలుగు హీరోల హవా.. టాప్ లో కేవలం ఓకే ఒక్క బాలీవుడ్ హీరో
ఇటీవల కాలంలో స్టార్ హీరోల ర్యాంక్స్ అనేవి చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ అలాగే సోషల్ మీడియా ఇంకా శాటిలైట్ ఆధారంగా ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకున్న హీరోలకు ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా ర్యాంక్స్ కూడా వస్తున్నాయి. ఇక ఆ రూట్లో ఎక్కువగా సర్వేలు నిర్వహించే ఓరామాక్స్ సర్వే ఆధారంగా మరొక లిస్టు విడుదల అయింది. ఈసారి ఇండియా వైడ్ గా ఆగస్టు నెలలో బాగా పాపులర్ అయిన హీరోల లిస్టులో ఎక్కువగా మన హీరోలే ఉన్నారు. టాప్ 10లో కేవలం ఒకే ఒక్క బాలీవుడ్ హీరో అలాగే మరో ముగ్గురు తమిళ హీరోలు ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

విజయ్ 1, ప్రభాస్ 2
ఈసారి నెంబర్ వన్ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిలవడం విశేషం. ఆగస్టు నెలలో బాగా పాపులర్ అయిన హీరోలలో విజయ్ పేరు ఇండియా మొత్తంలో కూడా బాగా వైరల్ అయింది. ఇక రెండవ స్థానంలో ప్రభాస్ కోనసాగుతున్నాడు. అంతకుముందు చాలావరకు మొదటి స్థానంలో ప్రభాస్ కొనసాగుతూ వచ్చాడు. ఇక ఇప్పుడు విజయ్ మొదటి స్థానంలో ప్రభాస్ రెండో స్థానంలో నిలిచారు.

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్
ఇక మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. RRR సినిమా తరువాత అతని పేరు బాగా వైరల్ అయింది. అంతకుముందు సినిమాలకు సంబంధించిన ఇతర విషయాలు కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇక అతను ఆస్కర్ కి కూడా నామినేట్ అవుతాడు అని ఫాన్స్ అయితే బాగానే హడావిడి చేశారు. దీంతో ఓరామ్యాక్స్ సర్వేలో అతను మూడో స్థానంలో నిలువగా నాలుగో స్థానంలో అల్లు అర్జున్ నిలిచాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతోనే ఆగస్టు నెలలో ట్రెండింగ్ లిస్టులో నిలిచాడు.

ఒకే ఒక్క బాలీవుడ్ స్టార్
ఓరామ్యాక్స్ మోస్ట్ పాపులర్ లిస్టులో 5వ ర్యాంకులో కన్నడ స్టార్ హీరో యష్ నిలవడం విశేషం. అంతకుముందు వరకు అతనికి ఈ రేంజ్ లో అయితే గుర్తింపు రాలేదు. ఈసారి యష్ పేరు బాగా పాపులర్ అయింది. ఇక 6వ స్థానంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచాడు. ఈసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా సౌత్ ఇండస్ట్రీలోని హీరోలను పెద్దగా డామినేట్ చేయలేదు.

రామ్ చరణ్, మహేష్ బాబు
ఓరామక్స్ సర్వేలో రాంచరణ్ 7వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అతను కూడా RRR ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కు సంబంధించి ఇంటర్నెట్ ప్రపంచంలో గత రెండు మూడు నెలలు హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక అతని తరువాత ఎనిమిదవ స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు. ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకపోయినప్పటికీ మహేష్ బాబు పేరు నేషనల్ లెవెల్ లో వైరల్ అవుతుంది.

చివరలో తమిళ హీరోలు
ఇక టాప్ 10 ర్యాంక్స్ లో చివరి రెండు స్థానాలను మరో తమిళ హీరోలు అందుకున్నారు. 9వ స్థానంలో టాలెంటెడ్ హీరో సూర్య నిలువగా ఆ తర్వాత పదవ స్థానంలో అజిత్ నిలిచాడు. వీరిద్దరూ కూడా విభిన్నమైన సినిమాలతో తమిళపేక్షలతో పాటు తెలుగు ఆడియోన్స్ ను కూడా బాగానే కట్టుకుంటున్నారు. ముఖ్యంగా సూర్య అయితే విక్రమ్ రోలెక్స్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకున్నాడు. దీంతో అతను టాప్ ఇండియన్ పాపులర్ స్టార్స్ లో ఒకరిగా నిలిచాడు.


Click it and Unblock the Notifications











