Top Heroes: మరోసారి నెంబర్ 1 హీరో ప్రభాస్! అల్లు అర్జున్‌, మహేష్, రాంచరణ్‌కు ఎన్నో స్థానమంటే?

ప్రముఖ మీడియా రీసెర్చ్ సంస్థ ఆర్మాక్స్‌ మీడియా (Ormax Media) తాజాగా మోస్ట్‌ పాపులర్‌ సెలబ్రిటీల జాబితా విడుదుల చేసింది. 2026 జనవరికి సంబంధించి పాపులర్ నటీనటుల లిస్ట్​ ను (Ormax Stars India Loves - January 2026) అనే పేరిట విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్ దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ చర్చకు దారి తీసింది. ప్రతి నెలా ప్రేక్షకుల అభిరుచులు, సోషల్ మీడియా బజ్, గ్రౌండ్ లెవల్ పాపులారిటీ ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో ఈసారి టాలీవుడ్ హవా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని తన స్టార్‌డమ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించారు.

కేజీఎఫ్, కల్కి వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ క్రేజ్ నేషనల్ లెవల్‌లో ఏ స్థాయికి చేరిందో ఈ ర్యాంకింగ్ స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం ది రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా దేశంలోనే మోస్ట్ లవ్డ్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్, పాన్ ఇండియా మార్కెట్‌లో ఏర్పడిన ఇమేజ్ ఈ టాప్ ప్లేస్ లో ఉండటానికి కారణమని చెప్పొచ్చు.

Ormax Jan 2026 Rankings Prabhas Leads as Allu Arjun Mahesh Babu Ram Charan Jr NTR Dominate

రెండో స్థానంలో తమిళ స్టార్ దళపతి విజయ్ (Vijay) నిలవడం విశేషం. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా కూడా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ లిస్ట్ మరోసారి రుజువు చేసింది. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానమే ఆయనను రెండో స్థానంలో నిలిపింది. మూడో స్థానంలో ఐకాన్ అల్లు అర్జున్ చోటు దక్కించుకోగా, నాలుగో స్థానంలో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ నిలిచారు.

టాప్ 10 జాబితాను పరిశీలిస్తే తెలుగు హీరోల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఐదో స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏడో స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎనిమిదో స్థానంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నిలవడం టాలీవుడ్ అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారింది. ఇక ఆరో స్థానంలో తమిళ స్టార్ అజిత్ కుమార్, తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ , పదో స్థానంలో ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు.

ఈ లిస్ట్ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..గత నెల టాప్ 10లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి జాబితా నుంచి తప్పుకోవడం. సినిమాల కంటే రాజకీయాల్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి కేవలం ముగ్గురికే టాప్ 10లో చోటు దక్కడం, ప్రేక్షకుల అభిరుచులు ఏ దిశగా మారుతున్నాయో చెప్పే సూచికగా మారింది.

'పుష్ప'తో నార్త్ ఆడియన్స్ గుండెల్లో చోటు దక్కించుకున్న అల్లు అర్జున్, 'RRR' తర్వాత గ్లోబల్ గుర్తింపు పొందిన రామ్ చరణ్, ఎన్టీఆర్ వరుసగా తెలుగు హీరోలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. మాస్, ఎమోషన్ కథనాలతో సౌత్ హీరోలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రాబోయే భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా రిలీజ్‌లతో ఈ స్టార్‌ల క్రేజ్ మరింత పెరగడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: prabhas allu arjun mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X