Top 10 Heroes: మరోసారి నెంబర్ 1గా ప్రభాస్.. అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ ర్యాంక్ ఎంతంటే?

ORMAX STARS INDIA LOVES: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ప్రతి నెల ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఓర్మాక్స్ మీడియా (Ormax Media) మార్చి 2026 నెలకు సంబంధించిన భారత దేశంలో అత్యంత ప్రజాదరణ నటుల జాబితా(Most Popular Male Film Stars in India)ను విడుదల చేసింది. ఈ జాబితా కేవలం అభిమానుల అంచనాలు మాత్రమే కాకుండా, ప్రజాదరణ, సోషల్ మీడియా ట్రెండ్స్, స్టార్‌పై జరుగుతున్న చర్చలు, ప్రస్తుత సినిమాల హైప్, ఫ్యాన్ ఫాలోయింగ్, దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు వంటి అనేక అంశాల ఆధారంగా రూపొందించబడుతుంది. అందుకే ఈ ర్యాంకింగ్స్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. తాజా జాబితాలో మరోసారి తెలుగు హీరోలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడం విశేషం. ఇంతకీ ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?

ఓర్మాక్స్ జాబితాలో మరోసారి మొదటి స్థానాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కైవసం చేసుకోవడం విశేషం. గత కొన్ని నెలలుగా ఆయన వరుసగా టాప్‌లో కొనసాగుతున్నారు. 'బాహుబలి' తర్వాత దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ఇప్పుడు తెలుగు హీరోగానే కాకుండా నేషనల్ లెవెల్ స్టార్‌గా నిలిచారు. ఆయన సినిమాలపై ఉన్న అంచనాలు, భారీ బడ్జెట్ ప్రాజెక్టులు, సోషల్ మీడియాలో అభిమానుల చర్చలు, దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అన్ని కలిపి ఆయనను మరోసారి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాయి. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా భారీ స్థాయిలో ఉండటంతో ప్రభాస్ హవా త్వరలో తగ్గేలా కనిపించడం లేదు.

Ormax March 2026 Top Heroes List Prabhas No 1 Allu Arjun Beats Vijay Again

ఈసారి జాబితాలో పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే.. అల్లు అర్జున్ (Allu Arjun)రెండో స్థానానికి ఎగబాకడం. ఎప్పటిలాగే రెండో స్థానంలో ఉంటారని భావించిన దళపతి విజయ్ (Vijay) ఈసారి మూడో స్థానానికి పడిపోయారు. విజయ్‌ను వెనక్కి నెట్టి బన్నీ రెండో స్థానాన్ని దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 'పుష్ప' సిరీస్ తర్వాత అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ తెలిసిందే. ప్రస్తుతం 'రాకా' సినిమా పనులతో బిజీగా ఉన్న ఆయన పేరు ఎప్పటికప్పుడు వార్తల్లో వినిపిస్తోంది. కొత్త సినిమా లుక్స్, షూటింగ్ అప్‌డేట్స్, ఫ్యాన్ బేస్ అన్ని కలిసి ఆయన ప్రజాదరణను మరింత పెంచాయి. దీంతో విజయ్‌కు షాక్ ఇస్తూ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఇక మూడో స్థానంలో నిలిచిన విజయ్ (Vijay) నిలిచారు. ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోగానే కొనసాగుతున్నారు. తమిళనాడులోనే కాకుండా దక్షిణాదిలో ఆయనకు ఉన్న అభిమాన వర్గం చాలా పెద్దది. అయితే ఈసారి అల్లు అర్జున్ క్రేజ్ ముందు ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. అయినప్పటికీ టాప్ 3లో కొనసాగడం విజయ్ స్థాయిని చూపిస్తోంది. ఇక నాలుగో స్థానంలో షారుక్ ఖాన్ (Shah Rukh Khan)నిలిచారు. బాలీవుడ్‌లో ఇప్పటికీ అత్యంత ప్రభావశీల స్టార్‌లలో షారూఖ్ ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు దేశవ్యాప్తంగా మంచి చర్చకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆయనకున్న ఫాలోయింగ్ అసాధారణం. గత నెలలోనూ నాలుగో స్థానంలో ఉన్న ఆయన ఈసారి కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఇక ఐదో స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నిలిచారు. ఫిబ్రవరిలో ఆయన ఆరో స్థానానికి పడిపోయినా, ఇప్పుడు మళ్లీ ఒక మెట్టు ఎక్కారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తో మహేష్ చేయబోయే భారీ ప్రాజెక్ట్‌ వారణాసిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా వార్తలు, ప్రీ ప్రొడక్షన్ చర్చలు, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి అన్ని కలిసి మహేష్ ర్యాంక్ పెరగడానికి కారణమయ్యాయి.

ఇక ఆరో స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. ఫిబ్రవరిలో ఐదో స్థానంలో ఉన్న ఆయన ఈసారి ఒక మెట్టు దిగారు. అయినప్పటికీ టాప్ 10లో ఆయన స్థానం బలంగానే ఉంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత దేశవ్యాప్తంగా చరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కొత్త సినిమాల అప్‌డేట్స్, పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఆయన ప్రజాదరణ పొందుతోంది. ఏడో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తెచ్చే హీరోగా ఆయన పేరు ఉంది. అభిమానుల్లో సల్మాన్‌కు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఆయన టాప్ 10లో స్థిరంగా కనిపిస్తారు.

ఎనిమిదో స్థానంలో రణవీర్ సింగ్ నిలవడం మరో ఆసక్తికర అంశం. ఈసారి మొదటిసారి టాప్ 10లో చోటు సంపాదించడం విశేషం. 'ధురంధర్ 2' చర్చలతో ఆయన పేరు మళ్లీ హాట్ టాపిక్ అయింది. విభిన్నమైన పాత్రలు, ఎనర్జీటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా రణ్‌వీర్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇక తొమ్మిదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. గత నెల ఎనిమిదో స్థానంలో ఉన్న ఆయన ఈసారి ఒక మెట్టు దిగారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్టీఆర్‌కు ఉన్న అభిమాన వర్గం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్టుల వల్ల ఆయన స్థాయి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పదో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. వరుస సినిమాలు, భారీ రిలీజ్‌లు, హిందీ మార్కెట్‌లో స్థిరమైన ఇమేజ్ కారణంగా అక్షయ్ ఇంకా ఈ జాబితాలో కొనసాగుతున్నారు.

ఈసారి టాప్ 10లో లేకపోయిన ఇద్దరు హీరోలు ప్రత్యేకంగా చర్చకు వచ్చారు. గత నెల జాబితాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి చోటు దక్కించుకోలేదు. అలాగే తరచూ ఈ జాబితాలో కనిపించే అజిత్ కుమార్ కూడా ఈసారి టాప్ 10లో లేరు. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో తెలుగు హీరోల ప్రభావం ఎక్కువగా ఉంది. టాప్ 10లో ఐదుగురు తెలుగు హీరోలు ఉండటం చిన్న విషయం కాదు. పాన్ ఇండియా మార్కెట్‌ను తెలుగు సినిమాలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో ఈ ర్యాంకింగ్స్ మరోసారి నిరూపించాయి.

Read more about: ormax media allu arjun prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X