తెలుగు ప్రజల కళ్లన్నీ ఆ సినిమాల వైపే.. మీరు కూడా వాటి కోసమే వెయిటింగా!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సినీ ప్రముఖులపై, సినిమాలపై సర్వేలు నిర్వహిస్తూ.. ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుందీ సంస్థ. అయితే తాజాగా తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాను విడుదల చేసింది. 2024 సంవత్సరంలో తెలుగు ప్రజలు అంతా ఏ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు అనే దానిపై సర్వే నిర్వహించింది. ఇక ఆ సర్వేలో ప్రభాస్, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి. అయితే ఆర్మాక్స్ రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ చిత్రాలు ఏంటో మనం ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశ ప్రజలంతా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం వేచి చూస్తున్నారు. గతంలో విడుదల అయిన పుష్ప పార్ట 1 కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తెలుగులోనే మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిచింది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహించగా... పార్ట్ 2 కోసం కూడా ఇదే కాంబో రిపీట్ అవుతుంది. పాన్ వరల్డ్ గా రాబోతున్న ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇక టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ టాప్ 2 సినిమాలో.. కల్కి 2898 ఏడీ నిలిచింది. ప్రభాస్ హీరోగా రాబోతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు క్రియేట్ అయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానిలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇక తెలుగు సినీ ప్రేక్షకులంతా వేచి చూస్తున్న టాప్ 5 సినిమాల్లో దేవర టాప్ 3గా నిలిచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరనస జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. అయితే అంతా ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఇక టాప్ 4లో ఓజీ సినిమా నిలిచింది. పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. అలాగే సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా... ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. మరి ఎప్పుడు పూర్తి అవుతుందో తెలాయాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

టాప్ 5గా ప్రభాస్ సినిమా స్పిరిట్ నిలిచింది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీవ్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాపై కూడా పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. వీరిద్దరి కాంబో మూవీ కూడా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











