Year Ender 2023: తెలుగు వాళ్లు మెచ్చిన టాప్ 5 సీరియల్ హీరోయిన్లు వీళ్లే.. మీకు నచ్చిన నటి ఉందేమో చూడండి!

సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి ఓ సినిమాలు టాప్ లో ఉన్నాయి, ఓ హీరోలు టాప్ లో ఉన్నారు, ఏ హీరోయిన్లు టాప్ లో ఉన్నారు అనే విషయాలను ఓర్మాక్స్ మీడియా వారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా జాబితా విడుదల చేస్తుంటారు. ఏ భాష ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు టాప్‌లో ఉన్నారో ఈ సంస్థ ప్రకటిస్తూ ఉంటుంది. కేవలం హీరో, హీరోయిన్లకే కాకుండా.. టీవీల్లో వచ్చే సీరియళ్ల లీడ్ రోల్స్ చేసే వారి నుంచి కూడా జాబితా రూపొందిస్తుంది. అలా ఈసారి కూడా టాప్ 5 సీరియల్ హీరోయిన్ల జాబితా రూపొందించి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.

తెలుగు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే ధారావహికల్లో ముఖ్య పాత్రలు పోషించి, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న టాప్-5 నటీమణుల జాబితా విడుదల చేసింది. ఓర్మాక్స్ మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ తెలుగు పేరుతో నవంబర్ 2023 నెలలో టాప్ లో ఉన్న ఆ నటీమణులు ఎవరంటే..

Ormax Released Most Popular Fiction Charcters on Telugu Serial Check Details

మొదటి స్థానంలో ఉన్నది కృష్ణ. కృష్ణా ముకుంద మురారీ సీరియల్ లో అద్భుతమైన తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కృష్ణా క్యారెక్టర్ పోషించిన ప్రేరణ. ఈ తెలుగు బ్యూటీ తన అందంతో, అభినయంతో విశేషంగా ఆకట్టుకుంటోంది. మన ఇంటి మనిషిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

బ్రహ్మముడి సీరియల్ కావ్య రెండో స్థానంలో నిలిచింది దీపికా రంగరాజు. కావ్య పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది దీపికా రంగరాజు.

Ormax Released Most Popular Fiction Charcters on Telugu Serial Check Details

త్రినయని సీరియల్ ద్వారా తన అందంతో, అంతకు మించిన అభినయంతో ఆకట్టుకుంటోంది నయని. తన అసలు పేరు ఆశికా పదుకొనే. ఈ కన్నడ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. అద్భుతమైన హావభావాలతో ఆకట్టుకుంటోంది.

ఓర్మాక్స్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నది గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా దగ్గరైన వసుధార. ఈ అమ్మడి అసలు పేరు దక్షా గౌడ. ఈ కన్నడ బ్యూటీ తన అందంతో, అభినయంతో విశేషంగా ఆకట్టుకుంటోంది.

Ormax Released Most Popular Fiction Charcters on Telugu Serial Check Details

నాగపంచమి సీరియల్ లో పంచమి క్యారెక్టర్ పోషించిన దర్షిణి గౌడ.. తన నటనతో ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ కన్నడ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను విశేషంగా దగ్గరైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X