2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాప్ 10 తెలుగు చిత్రాలివే.. టాప్ 1లో విరూపాక్ష, సలార్ ఏ స్థానంలో ఉందంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నసినీ తారలు, సినిమాలపై సర్వేలు నిర్వహిస్తూ వాటి ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందరు మెచ్చిన నటీనటులతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించిన విషయాలను కూడా చెబుతుంటుంది. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ 2023లో వచ్చిన అద్భుతమైన, అందరూ మెచ్చిన సినిమాల జాబితాను విడుదల చేసింది. అందులో రెండే రెండు పెద్ద చిత్రాలు ఉండగా.. మిగిలివన్న బీ గ్రేడ్ హీరోల సినిమాలే. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ఒరిజినల్ తెలుగు భాషల్లో విడుదల అయిన, అందరు మెచ్చిన టాప్ 10 సినిమాల లిస్టును ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎక్స్ వేధికగా ప్రకటించింది. ముఖ్యంగా ఇందులో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఇందులో మొదటి స్థానంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన విరూపాక్ష సినిమా నిలిచింది. అందరూ మెచ్చిన 2023 టాప్ 10 తెలుగు సినిమాల్లో టాప్ 1లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రెండో స్థానంలో ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా నిలిచింది. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Ormax Released Top 10 Most Liked Telugu Films of 2023 Check Details

ఇక టాప్ 3లో మ్యాడ్ సినిమా నిలిచింది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంగీత్ శోభన్ నితిన్ రామ్, రవి ఆంటోనీ, అనంతక, శ్రీ గౌరిప్రియ, గోపికా ఉదయన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాకు యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇక టాప్ 4లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ లు హీరోయిన్లుగా వచ్చిన హాయ్ నాన్న సినిమా నిలిచింది. అద్భుతమైన ఎమోషన్స్ తో అందరినీ ఆకట్టుకుని హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ లో టాప్ లోనే ఉంది.

ఇక టాప్ 5లో నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వచ్చిన దసరా సినిమా నిలిచింది. 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2023 ఏప్రిల్ 7 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎనిమిదో చిత్రంగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక టాప్ 6లో వైష్ణవీ చైతన్య హీరోయిన్.. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా వచ్చిన బేబీ సినిమా నిలిచింది. సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. టాప్ 7లో అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టిల మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా నిలిచింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టు అయింది.

Ormax Released Top 10 Most Liked Telugu Films of 2023 Check Details

ఇక టాప్ 8లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా నిలవగా... టాప్ 9లో సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా నిలిచింది. ఇక చివరలో అంటే టాప్ 10 లిస్టులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య నిలిచింది. ఇలా కేవలం రెండు పెద్ద సినిమాలు మాత్రమే ఈ లిస్టులో స్థానం సంపాధించుకోగా.. చిన్న చిత్రాలే గతేడాది సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X