Top 10 Telugu stars: సర్వేలో ఊహించని మార్పులు.. మహేష్ తరువాతే మెగా బ్రదర్స్!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇటీవల కాలంలో సినీ తారలకు సంబంధించిన సర్వేలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇక అందులో ప్రధానంగా ఓరామ్యాక్స్ కు సంబంధించిన సర్వేలు కూడా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు స్టార్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉండడంతో వారి ర్యాంక్స్ కూడా మారుతున్నాయి. ఇక ఓరామ్యాక్స్ స్టార్స్ ఇండియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ లో ఆగస్టు నెలలో బాగా పాపులర్ అయిన హీరోల లిస్ట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

 ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్

ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్

రెబల్ స్టార్ ప్రభాస్ ఆగస్టు నెలలో ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన అంశాలతో బాగా హాట్ టాపిక్ గా నిలిచాడు. అంతేకాకుండా ఇతర సినిమాలకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ కూడా ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ పేరు నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ బీజేపీ హోం మంత్రి అమిత్ షా ను కలుసుకోవడంతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ - రామ్ చరణ్

అల్లు అర్జున్ - రామ్ చరణ్

ఇక పుష్ప సినిమాతోనే మరోసారి అల్లు అర్జున్ ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వైరల్ అయ్యాడు. అలాగే టెలివిజన్ లో కూడా ఇటీవల అతని పేరు బాగానే చర్చకు వచ్చింది. దీంతో ఈ సర్వేలో బన్నీ మూడు స్థానంలో నిలిచాడు. ఇక ఆగస్టు నెలలో రామ్ చరణ్ పేరు కూడా బాగా ట్రెండ్ అయింది. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన వార్తలు కూడా కొంత హైలైట్ అయ్యాయి. దీంతో చరణ్ ఓరామ్యాక్స్ లో 4వ స్థానంలో ఉన్నాడు.

మహేష్ బాబు - పవన్ కళ్యాణ్

మహేష్ బాబు - పవన్ కళ్యాణ్

సర్వేలో ఈసారి మహేష్ బాబు ఐదవ స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు టాప్ 3 లో కొనసాగిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ద్వారా ఐదవ స్థానంలో హైలైట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నిలవడం విశేషం. హరిహర వీరమల్లుకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు పొలిటికల్ అంశాలతో పవన్ పేరు అటు టెలివిజన్ న్యూస్ ఛానెల్స్ లో బాగా ట్రెండ్ అయింది.

నాని - విజయ్ దేవరకొండ

నాని - విజయ్ దేవరకొండ

ఇక ఎప్పటిలానే నాని టాప్ 5 లిస్టు తర్వాత ఏడవ స్థానంలో నిలిచాడు. అతని దసరా సినిమాకు సంబంధించి లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఇక లైగర్ సినిమాతో ఆగస్టు నెలలో బాగా క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మాత్రం ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. గతంలో విజయ్ టాప్ ఫైవ్ లిస్టులో కూడా కొనసాగాడు.

చిరంజీవి - రవితేజ

చిరంజీవి - రవితేజ

ఈ సర్వేలో ఈసారి మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదవ స్థానంలో ఉండడం విశేషం. ఇంతకుముందు టాప్ ఫైవ్ లో కూడా కనిపించిన మెగాస్టార్ ఈసారి గాడ్ ఫాదర్ సినిమా కు సంబంధించిన అప్డేట్స్ ద్వారా మీడియాలో బాగానే హాట్ టాపిక్ గా నిలిచారు. ఇక మాస్ మహారాజా రవితేజ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ద్వారా ఆడియన్స్ లో దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతనికి ఈ సర్వేలో 10వ స్థానం దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X