Tollywood: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోలు.. ఆ ముగ్గురిదే హవా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకునే విధంగా ముందుకు వెళుతున్నారు. ఫ్యాన్ ఇండియా సినిమాలతో భాషతో సంబంధం లేకుండా మంచి మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక వారికి సంబంధించిన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే సోషల్ మీడియాలో హడావిడి మాములుగా ఉండదు. ఇక ఇటీవల కాలంలో మన స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫాలోవర్స్ అయితే పెరుగుతున్నారు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ ట్విట్టర్లో ఒక రికార్డును అందుకున్నాడు. ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో టాప్ 3 లో ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరు అనే వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..


సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో సినీ తారలకు చాలా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే వారి సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటున్నారు. ఇక కొంతమంది సినీ నటులకు అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోని బట్టి కూడా మార్కెట్ రేంజ్ పెరుగుతుంది. ఆ రూట్ లో కూడా చాలామంది ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు.

ట్విట్టర్ లో నెంబర్ వన్

ట్విట్టర్ లో నెంబర్ వన్


ఇక సోషల్ మీడియాలో ప్రధానంగా సినీతరులకు ఎక్కువగా ఉపయోగపడేది మాత్రం ట్విట్టర్ అనే చెప్పాలి. ఇందులో వారి సినిమాలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ట్విట్టర్లో అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య 12.7 మిలియన్స్ కు చేరుకుంది.

అల్లు అర్జున్, రానా

అల్లు అర్జున్, రానా


ఇక రీసెంట్గా అల్లు అర్జున్ ఒక సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా ద్వారా నేషనల్ వైడ్ గాని మంచి క్రేజ్ అందుకున్న స్టైలిష్ స్టార్ రీసెంట్ గా ట్విట్టర్లో 7 మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకున్నాడు. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా ద్వారా కూడా అతనికి ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక టాలీవుడ్ నుంచి ట్విట్టర్లో అత్యధిక పాలివర్స్ కలిగిన హీరోలలో రానా దగ్గుపాటి మూడవ స్థానంలో 6.5 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతున్నాడు

 ఇందులో బన్నీ టాప్

ఇందులో బన్నీ టాప్


ఇక ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని వివరాల్లోకి వెళితే అత్యధికంగా అల్లు అర్జున్ డామినేట్ చేస్తున్నాడు. అతనికి అత్యధికంగా 18.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా ఆ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో 16.9 మిలియన్ల ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మహేష్ బాబు మూడో స్థానంలో 8.7 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు.

ఇందులో ప్రభాస్ టాప్

ఇందులో ప్రభాస్ టాప్


ఇక ప్రభాస్ ట్విట్టర్ లో అయితే లేడు కానీ అతను ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటాడు. ప్రభాస్ ఫేస్ బుక్ లో అత్యధికంగా 24 మిలియన్స్ ఫాలోవర్స్ తో టాలీవుడ్ హీరోలలో నెంబర్ వన్ గా నిలుస్తున్నాడు. ఇక అదే ప్లాట్ ఫామ్ లో అల్లు అర్జున్ ఆ తర్వాత స్థానంలో 21 మిలియన్ల ఫాలోవర్స్ తో కలిగి ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో మహేష్ బాబు 15 మిలియన్ల ఫాలోవర్స్ తో కొనసాగుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X