కరోనాపై పోరాటం: కదలివస్తున్న సినీలోకం.. డైరెక్టర్ సుకుమార్ విరాళం
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల్లో తామూ భాగం పంచుకుంటాం అంటూ ముందుకొస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే ముందుగా చెప్పిన దానికంటే ఇంకా కొన్ని రోజులపాటు ఈ లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా సహాయక చర్యలు చేపడుతున్న దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఆ ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ తమ వంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు టాలీవుడ్ సినీ ప్రముఖులు. ఇప్పటికే నితిన్, చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, అల్లు అర్జున్ లాంటి వారు తమ తమ ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. తాజాగా అదేబాటలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ముందుకొచ్చారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5 లక్షల చొప్పునతన విరాళాన్ని ప్రకటించారు సుకుమార్. ఈ విరాళాలను త్వరలోనే ప్రభుత్వాలకు అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు. కరోనా వైరస్ నివారణ, పోరాటంలో ఇలా టాలీవుడ్ సినీలోకం కదలిరావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications











