Oscar విజేతలకు ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్.. ఆస్కార్ ను అమ్మితే ఎంత వస్తుందంటే?
RRR సినిమా ఆస్కార్ సాదించడంతో ఆస్కార్ అంటే ఏమిటో తెలియని వారికి కూడా ఇండియాలో ఇప్పుడు క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక RRR సినిమా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే చాలావరకు ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ లో అవార్డ్స్ లతో పాటు నగదు బహుమతులు కూడా ఉంటాయి.
ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న ఆస్కార్ కు ప్రైజ్ మనీ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలోగిస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మొదట గోల్డెన్ గ్లొబ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఆస్కార్ అవార్డుకు నాటు నాటు పాట నామినేట్ కావడం కూడా అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగించింది. ఇక మొత్తానికి అవార్డ్ డక్కడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

అంత ఖర్చు చేసిన మాట వాస్తవమే..
అయితే ఆస్కార్ అవార్డ్ కోసం RRR చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేసిందని చాలా రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 80 కోట్ల వరకు ఖర్చయింది అని కూడా పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ కోసమే రాజమౌళి టీం ప్రమోట్ చేసింది కానీ అవార్డు గెలుచుకోవడానికి కాదు. అలా అవార్డు గెలిస్తే మాత్రం చాలామంది హాలీవుడ్ నటీనటులు కొనగలిగే సత్తా ఉన్నవాళ్లే అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆస్కార్ ప్రైజ్ మనీ?
అయితే ఆస్కార్ అవార్డు రావడం వలన ఇప్పుడు భారతదేశంలో కూడా చాలామందికి అవార్డుకు ఉన్న విలువ గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇతర ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటారు ఇక ఆస్కార్ అవార్డుకు ఇంకా ఈ స్థాయిలో అవార్డులు ఇస్తారా? అని ఒక ఆలోచన కూడా రాకుండా ఉండదు.

తయారు చేయడానికి..
అసలైతే నిజానికి ఆస్కార్ అవార్డును తయారు చేయడానికి దాదాపు 400 డాలర్లు ఖర్చు అవుతుందట.బంగారం పూత పూసి ఆస్కార్ బొమ్మను తయారు చేస్తారు. ఇక దీని సెలక్షన్ వెనుక కూడా చాలా రీసెర్చ్ అనేది ఉంటుంది. అయితే దాన్ని ఏ కోణంలో సెలెక్ట్ చేస్తారు అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరికీ కూడా చెప్పలేదు ఆ విధంగా ఆస్కార్ అవార్డులు కొనసాగుతున్నాయి.

అమ్మే హక్కు కూడా లేదు..
అయితే ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత దానికి ప్రైజ్ మనీ ఎంత వస్తుంది అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ నిజానికి ఆస్కార్ అవార్డుకు ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు. కేవలం ఆ బ్రాండ్ వాల్యూ కోసం చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక దీనిని కనీసం అమ్మడానికి కూడా వీలు లేదు. చట్టపరంగా కొన్ని రూల్స్ కూడా ఉంటాయి అయితే ఒకవేళ అమ్మాలని అనుకుంటే ఆస్కార్ అకాడమీ వాళ్లు మాత్రమే దాన్ని కొనుగోలు చేసే వీలుంటుంది. కూడా కేవలం ఒక డాలర్ మాత్రమే వారు ఇస్తారు.

వారికి మాత్రం కోటి రూపాయల బహుమతి
అయితే ఆస్కార్ అవార్డుకు గెలిచిన వారికి పెద్దగా నగదు బహుమతి ఏమీ ఉండదు కానీ నామినేషన్స్ లో ఉన్న వారికి మాత్రం కోటి రూపాయల విలువ చేసే ఒక ఖరీదైన లగ్జరీ బ్యాగ్ ను మాత్రం గిఫ్ట్ హాంపర్ గా ఇచ్చే ఆచారం అయితే కొనసాగుతోంది లాస్ ఏంజిల్స్‌కు చెందిన 'డిస్టింక్టివ్ అస్సెట్స్' మార్కెటింగ్ కంపెనీ ఆ బ్యాగ్ ను కానుకగా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











