Oscars 2025 Nominations : 2025 ఆస్కార్స్ నామినేషన్ ఫుల్ లిస్ట్... బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్

ప్రపంచ సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక ఆస్కార్. 97వ అకాడెమీ అవార్డ్స్ వేడుకకు సర్వం సిద్ధమైంది. మార్చి 3న సినిమా అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ను భావిస్తారు. ప్రతి ఏడాది ఆస్కార్స్ ఈవెంట్ లాస్ ఏంజెల్స్ లో ఎంతో ఘనంగా జరుగుతోంది. గతేడాది 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ కు ఓరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అవార్డులు అందుకున్నారు. ఇక ప్రస్తుతం 97వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 3న ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 23 కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. ఈ సందర్బంగా ఆస్కార్ బరిలో నిలిచిన నామినిల ఫుల్ లిస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం విభాగంలో..
బెస్ట్ పిక్చర్స్ కేటగిరిలో అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్ నోన్, కాన్క్లేవ్, డూన్: రెండవ భాగం, ఎమిలియా పెరెజ్, ఐ యామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, వికెడ్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.

Oscars 2025 Nominations Full List Here is 97th Academy Awads Nominations list
ఉత్తమ నటుడు కేటగిరీలో...
బెస్ట్ యాక్టర్ విభాగంలో అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), టిమోతీ చలమెట్ (ఎ కంప్లీట్ అన్ నోన్), కోల్మన్ డొమింగో (సింగ్ సింగ్), రాల్ఫ్ ఫియన్నెస్ (కాన్క్లేవ్), సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)లు నామినీలుగా ఉన్నారు.

ఉత్తమ నటి కేటగిరిలో...
బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో సింథియా ఎరివో (వికెడ్), కార్లా సోఫియా గాస్కాన్ (ఎమిలియా పెరెజ్), మైకీ మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)లు ఎంపికయ్యారు. ఫైనల్ లిస్ట్ ఎవరుంటో చూడాలి.

ఉత్తమ సహాయ నటుడు విభాగంలో..
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో యురా బోరిసోవ్ (అనోరా), కియెరాన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్), ఎడ్వర్డ్ నార్టన్ (ఎ కంప్లీట్ అన్ నోన్), గై పియర్స్ (ది బ్రూటలిస్ట్), జెరెమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్) పోటీ పడుతున్నారు.

ఉత్తమ సహాయ నటిగా..
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో మోనికా బార్బారో (ఎ కంప్లీట్ అన్‌నోన్), అరియానా గ్రాండే (వికెడ్), ఫెలిసిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్), ఇసాబెల్లా రోసెల్లిని (కాన్‌క్లేవ్), జో సాల్డానా (ఎమిలియా పెరెజ్) లు నామినీల జాబితాలో ఉన్నారు.

బెస్ట్ డైరెక్టర్ విభాగంలో... సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మాంగోల్డ్ (ఎ కంప్లీట్ అన్‌నోన్), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)లు పోటీలో ఉన్నారు.

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే... విభాగంలో అనోరా (సీన్ బేకర్),
ది బ్రూటలిస్ట్ (బ్రాడీ కార్బెట్ అండ్ మోనా ఫాస్ట్‌వోల్డ్), ఏ రియల్ పెయిన్ (జెస్సీ ఐసెన్‌బర్గ్), సెప్టెంబర్ 5 (మోరిట్జ్ బైండర్, టిమ్ ఫెహ్ల్‌బామ్ అండ్ అలెక్స్ డేవిడ్), ది సబ్‌స్టాన్స్ (కోరలీ ఫార్గేట్) చిత్రాలు పోటీ పడుతున్నాయి.

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే కేటగిరిలో.. ఎ కంప్లీట్ అన్‌నోన్ (జేమ్స్ మాంగోల్డ్ అండ్ జే కాక్స్), కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్), ఎమిలియా పెరెజ్ (జాక్వెస్ ఆడియార్డ్), నికెల్ బాయ్స్ (రామెల్ రాస్ అండ్ జోస్లిన్ బార్న్స్), సింగ్ సింగ్ (క్లింట్ బెంట్లీ అండ్ గ్రెగ్ క్వెడార్) చిత్రాలు నామినీ జాబితాలో ఉన్నాయి.

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో... ఐ యామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్), ది గర్ల్ విత్ ది నీడిల్ (డెన్మార్క్), ఎమిలియా పెరెజ్ (ఫ్రాన్స్), ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (జర్మనీ), ఫ్లో (లాట్వియా) చిత్రాలు ఆస్కార్ బరిలో ఉన్నాయి.

ఉత్తమ సినిమాటోగ్రఫీగా.. ది బ్రూటలిస్ట్, డూన్: పార్ట్ టూ, ఎమిలియా పెరెజ్, మరియా, నోస్ఫెరాటు లు పోరులో ఉన్నారు.

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో... ఎ కంప్లీట్ అన్ నోన్, కాన్క్లేవ్, గ్లాడియేటర్ 2, నోస్ఫెరాటు, వికెడ్ చిత్రాలు పోటీలో ఉన్నాయి.

ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీలో... అనోరా, ది బ్రూటలిస్ట్, కాన్క్లేవ్, ఎమిలియా పెరెజ్, వికెడ్ చిత్రాలు నామినీలో ఉన్నాయి.

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో.. ఏ డిఫరెంట్ మ్యాన్, ఎమిలియా పెరెజ్, నోస్ఫెరాటు, ది సబ్‌స్టెన్స్, వికెడ్ చిత్రాలు ఆస్కార్ బరిలో ఉన్నాయి.

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో.... ది బ్రూటలిస్ట్ (డేనియల్ బ్లంబర్గ్), కాన్క్లేవ్ (వోల్కర్ బెర్టెల్మాన్), ఎమిలియా పెరెజ్ (క్లెమెంట్ డుకోల్ అండ్ కామిల్లె), వికెడ్ (జాన్ పావెల్ అండ్ స్టీఫెన్ స్క్వార్ట్జ్), ది వైల్డ్ రోబోట్ (క్రిస్ బోవర్స్) చిత్రాలు ఆస్కార్ బరిలో నిలబడ్డాయి.

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో... ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్) - క్లెమెంట్ డుకోల్ అండ్ కామిల్లె, ది జర్నీ (ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్) - డయాన్ వారెన్, లైక్ ఎ బర్డ్ (సింగ్ సింగ్) - అబ్రహం అలెగ్జాండర్ అండ్ అడ్రియన్ క్వెసాడా, మి కామినో (ఎమిలియా పెరెజ్) - కామిల్లె అండ్ క్లెమెంట్ డుకోల్, నెవర్ టూ లేట్ (ఎల్టన్ జాన్: నెవర్ టూ లేట్) - ఎల్టన్ జాన్, బ్రాండి కార్లైల్, ఆండ్రూ వాట్, అండ్ బెర్నీ టౌపిన్ పోటీ పడుతున్నారు.

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో... ది బ్రూటలిస్ట్, కాంక్లేవ్, డ్యూన్: పార్ట్ టూ, నోస్ఫెరాటు, వికెడ్ పోటీలో ఉన్నాయి.

బెస్ట్ సౌండ్ కేటగిరీలో.. ఏ కంప్లీట్ అన్ నోన్, డ్యూన్ : పార్ట్ టూ, ఎమిలియా పెరెజ్, వికెడ్, ది వైల్డ్ రోబోట్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో.. ఏలియన్: రోములస్, బెటర్ మ్యాన్, డ్యూన్: పార్ట్ టూ, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, వికెడ్ చిత్రాలు పోటీలో ఉన్నాయి.

బెస్ట్ యానిమేటెడ్ చిత్రం విభాగంలో.. ఫ్లో, ఇన్‌సైడ్ అవుట్ 2, మెమోయిర్ ఆఫ్ ఎస్నేల్, వాలెస్ అండ్ గ్రోమిట్ : వెంజియన్స్ మోస్ట్ ఫౌల్, ది వైల్డ్ రోబోట్ చిత్రాలు లిస్ట్ లో చేరాయి.

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ విభాగంలో... బ్యూటిఫుల్ మెన్, ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్, మ్యాజిక్ క్యాండీస్, వాండర్ టు వండర్, యక్! చిత్రాలు పోటీ పడుతున్నాయి.

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో... బ్లాక్ బాక్స్ డైరీస్,
నో అదర్ ల్యాండ్, పోర్సిలైన్ వార్, సౌండ్‌ట్రాక్ టు ఎ కూప్ డి'ఎటాట్, షుగర్కేన్ చిత్రాలు పోటీలో ఉన్నాయి.

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో.. డెత్ బై నంబర్స్,
ఐ యామ్ రెడీ, వార్డెన్, ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ ఏ బీటింగ్ హార్ట్,
ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా చిత్రాలు పోటీలో ఉన్నాయి.

ఉత్తమ లైవ్-యాక్షన్ షార్ట్ కేటగిరీలో... ఎ లియెన్, అనుజా, ఐయామ్ నాట్ ఎ రోబోట్, ది లాస్ట్ రేంజర్, ది మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సైలెంట్ లు బరిలో ఉన్నాయి.

More from Filmibeat

Read more about: oscars 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X