OTT Releases on today: అర్జున ఫాల్గుణ, బ్రో డాడీ, భడవా రాస్కెల్ రిలీజ్.. ఇంకా ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే..

థియేటర్‌కు వెళ్లి సినిమా అనుభూతిని పొందే అవకాశం కష్టంగా మారడంతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్‌స్టార్, జీ5, ఆహా లాంటి ఓటీటీలను ప్రేక్షకులు బ్రహ్మండంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రేక్షకులు ఇంటికే పరిమితం కావడంతో ఓటీటీ సినిమాల వీక్షణ ఎక్కువైంది. ప్రేక్షకుల డిమాండ్‌కు తగినట్టే ఓటీటీ సంస్థలు డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన సినిమాలను వారం వారం క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీలో ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి? ఆ సినిమాల జాబితా ఏమింటే..

డిస్నీ+హాట్‌స్టార్‌లో బ్రో డాడీ

డిస్నీ+హాట్‌స్టార్‌లో బ్రో డాడీ

సూపర్ స్టార్స్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన మలయాళ చిత్రం బ్రో డాడీ జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ చిత్రానికి అభినందన రామానుజం సినిమాటోగ్రఫిని అందించగా, దీపక్ దేవ్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో మీనా, కల్యాణి ప్రియదర్శన్, ఉన్ని ముకుందన్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

వూట్ ఓటీటీలో భడవ రాస్కెల్‌

వూట్ ఓటీటీలో భడవ రాస్కెల్‌

కన్నడ నటీనటులు ధనుంజయ్, అమృతా అయ్యంగార్, నాగభూషణ్ నటించిన భడవా రాస్కెల్ సినిమా వూట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి గురుశంకర్ దర్శకత్వంతోపాటు రచన, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి ధనుంజయ్, గుజ్జల్ పురుషోత్తం నిర్మాతలుగా వ్యవహరించారు. వాసుకి వైభవ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం 10 రోజుల్లో 16 కోట్లు వసూలు చేసింది.

 జీ5 ఓటీటీలో ఆహా మూవీ

జీ5 ఓటీటీలో ఆహా మూవీ


మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కే జయన్, సంథీ బాలచంద్రన్ నటించిన ఆహా చిత్రం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి బిబిన్ పాల్ శ్యామ్యూల్ దర్శకత్వం వహించారు. ప్రేమ్ అబ్రహం నిర్మించగా, రాహుల్ బాలచంద్రన్ సినిమాటోగ్రఫిని, సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ మ్యూజిక్ అందించారు.

జీ5 ఓటీటీలో ఎల్లామ్ షెరియాకమ్

జీ5 ఓటీటీలో ఎల్లామ్ షెరియాకమ్


మలయాళ నటులు ఆసీఫ్, రజీషా విజయన్, సిద్దిఖీ, ఇంద్రాన్స్, జాన్ ఆంటోని నటించిన ఎల్లామ్ షెరియాకమ్ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి జిబు జాకోబ్ దర్శకత్వం వహించగా, థామస్ తిరువల్ల, డాక్టర్ పాల్ వర్గీస్ నిర్మించారు. ఉసేప్పచన్ సంగీతం, శ్రీజిత్ నాయర్ సినిమాటోగ్రఫిని అందించారు. మలయాళంలో మంచి రెస్పాన్స్ అందుకొన్నది.

Recommended Video

Tollywood : Movies Ready To Release On OTT & Streaming Details | Filmibeat Telugu
ఆహా ఓటీటీలో అర్జున ఫాల్గుణ

ఆహా ఓటీటీలో అర్జున ఫాల్గుణ


తెలుగులో భారీ అంచనాలతో డిసెంబర్ 31న రిలీజైన అర్జున ఫాల్గుణ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శ్రీవిష్ణు, అమృత అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. కామెడీ, ఎమోషనల్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు తేజా మార్ని దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X